ముందస్తు వదలని బాబు..జగన్ ప్లాన్ అదే.!

ముందస్తు ఎన్నికల అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు వదలడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత నుంచి బాబు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. జగన్ ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందని, టీడీపీ శ్రేణులు రెడీగా ఉండాలని ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నారు. అయినా బాబు వర్షన్ ముందస్తుపైనే ఉంది. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, […]

అమరావతిలో బీఆర్ఎస్ సభ..కేసీఆర్ ప్లాన్ ఏంటి?

మొత్తానికి కేసీఆర్ జాతీయ పార్టీ రెడీ అయిపోయింది. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌గా మారిపోయింది. అలాగే ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ఓపెన్ చేశారు..కేసీఆర్ జాతీయ అధ్యక్షుడుగా మారిపోయారు. ఇక ఈయన పని ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడం. ఇందులో భాగంగా మొదట పక్కనే ఉన్న ఏపీలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఈ మేరకు ప్రణాళికలు కూడా రెడీ చేసుకుంటున్నారు. ఏపీలో తమకు ఆదరణ వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే అక్కడ కీలకమైన అంశాలపై […]

వారాహిని వదలని వైసీపీ..మరీ వింతగా ఉన్నారే!

ఎవరైకైనా తాము చేసే తప్పులు కనబడవు గాని…ఎదుటవారిని తప్పుబట్టడం బాగా తెలుస్తోంది. ఈ ఫార్ములాని అధికార వైసీపీ బాగా ఫాలో అవుతుంది. అధికారంలోకి రాగానే..ప్రభుత్వ బిల్డింగులకు వైసీపీ రంగులు వేయడం, సుప్రీం కోర్టులో మొట్టికాయలు తిని మళ్ళీ రంగులు తీయడం..ఇంకా ఎక్కడపడితే అక్కడ వైసీపీ రంగులు వేసుకురావడం, ఆఖరికి భూమి పట్టాలపైన జగన్ ఫోటోలని పెట్టడం..ఇలా ఒకటి ఏంటి తమదనే ముద్ర ఉండటానికి రకరకాల పనులు వైసీపీ చేసింది. అలాంటిది వైసీపీ నేతలు ఇప్పుడు బస్సు యాత్ర […]

సీమలో ఐప్యాక్..16 ఎమ్మెల్యేలతోన రిస్క్!

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడమే జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి 175కి 175 సీట్లు గెలవాలని టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అలాగే ఎమ్మెల్యేలని గడపగడపకు పంపారు. ఎప్పటికప్పుడు పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుంటున్నారు. పనితీరు బాగోకపోతే సీటు కూడా ఇవ్వనని అంటున్నారు. మొత్తం ఐప్యాక్ టీం సర్వే ద్వారా ఎమ్మెల్యేల భవితవ్యం తేలుస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఐప్యాక్ టీమ్ సర్వేలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు గురించి […]

ఉత్తరాంధ్ర టూర్‌కు బాబు..ఆ సీటు తేలుస్తారా.!

ఇటీవల కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలకు వెళుతూ..అక్కడ టీడీపీకి కొత్త ఊపు తీసుకొస్తున్నారు. ఎక్కడకక్కడ బాబు పర్యటనలకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది. బాదుడేబాదుడు కార్యక్రమం, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని కార్యక్రమాలని నిర్వహిస్తూ జిల్లాల టూర్లకు వెళుతున్నారు. ఇటీవల కాలంలో పల్నాడు, ఎన్టీఆర్, కర్నూలు, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో బాబు పర్యటనలకు భారీ స్పందన వచ్చింది. బాబు రోడ్ షోలకు జనం భారీ ఎత్తున వస్తున్నారు. తాజాగా పొన్నూరు, బాపట్ల […]

గంటా కాపు రాజకీయం..బెనిఫిట్ ఎవరికి?

ఏపీలో గంటా శ్రీనివాసరావు చేసే రాజకీయాలు ఎవరికి అర్ధంకావు అని చెప్పవచ్చు. ఆయన ఏ సమయంలో ఎలాంటి రాజకీయం చేస్తారో తెలియదు..అలాగే ఆయన పార్టీ మార్పులు కూడా పెద్ద మిస్టరీగా ఉన్నాయి. ఇప్పటివరకు వరుసగా పార్టీలు మారడం, నియోజకవర్గాలు మార్చడం గెలవడం గంటాకు అలవాటైన పని. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా..ఆ పార్టీ అధికారంలో లేకపోయేసరికి …ఇంకా టీడీపీలో అసలు కనిపించట్లేదు. రాజకీయంగా కూడా కనిపించలేదు..కానీ తెరవెనుక మాత్రం రాజకీయాలు నడిపిస్తూనే […]

ఏపీలో బీఆర్ఎస్..వైసీపీ ప్లాన్ అదే..!

బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు..తెలంగాణకే పరిమితమైన పార్టీని పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా విస్తరించాలని చూస్తున్నారు. అటు కర్ణాటక, మహారాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరిస్తారు. అయితే మొదట ఏపీపై ఫోకస్ చేశారు..అక్కడ పార్టీ ఆఫీసు పెట్టడానికి స్థలాన్ని కూడా చూస్తున్నారు. అయితే ఏపీలో బీఆర్ఎస్ పార్టీని పెడితే..దాని ప్రభావం ఎంత వరకు ఉంటుంది. అలాగే జగన్..కేసీఆర్‌కు ఎంతవరకు సహకరిస్తారనే అంశాలు చర్చకు వస్తున్నాయి. ఎలాగో జగన్‌తో కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. […]

ఉరవకొండలో పయ్యావులకు వైసీపీ బ్రదర్ సాయం..!

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో ఒకటిగా ఉన్న ఉరవకొండ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తిగా మారింది..నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ ఎవరు గెలుస్తారనేది క్లారిటీ రావడం లేదు. ఇక్కడ వైసీపీ-టీడీపీల మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. వాస్తవానికి ఇక్కడ గెలిచిన పార్టీ..రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఎక్కువ ఉంది. 1999 ఎన్నికల నుంచి అదే జరుగుతుంది. 1999లో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే…రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే..రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014లో వైసీపీ గెలవగా, […]

బోడేపై తమ్ముళ్ళు యాంటీ..టీడీపీలోకి సారథి?

రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో అటు వైసీపీలో గాని, ఇటు టీడీపీలో గాని నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీలో ఈ పోరు ఎక్కువగా ఉంది…సొంత పార్టీ నేతలకే ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఈ ఆధిపత్య పోరు టీడీపీలో కూడా ఉంది. పలు నియోజకవర్గాల్లో ఈ పోరు నడుస్తోంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో కూడా టీడీపీలో విభేదాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, […]