వారాహిని వదలని వైసీపీ..మరీ వింతగా ఉన్నారే!

ఎవరైకైనా తాము చేసే తప్పులు కనబడవు గాని…ఎదుటవారిని తప్పుబట్టడం బాగా తెలుస్తోంది. ఈ ఫార్ములాని అధికార వైసీపీ బాగా ఫాలో అవుతుంది. అధికారంలోకి రాగానే..ప్రభుత్వ బిల్డింగులకు వైసీపీ రంగులు వేయడం, సుప్రీం కోర్టులో మొట్టికాయలు తిని మళ్ళీ రంగులు తీయడం..ఇంకా ఎక్కడపడితే అక్కడ వైసీపీ రంగులు వేసుకురావడం, ఆఖరికి భూమి పట్టాలపైన జగన్ ఫోటోలని పెట్టడం..ఇలా ఒకటి ఏంటి తమదనే ముద్ర ఉండటానికి రకరకాల పనులు వైసీపీ చేసింది.

అలాంటిది వైసీపీ నేతలు ఇప్పుడు బస్సు యాత్ర కోసం సొంతంగా కొనుక్కొని సిద్ధం చేసుకున్న పవన్..బస్సుపై రకరకాల విమర్శలు చేస్తున్నారు. బస్సు యాత్ర కోసం అన్నీ సెక్యూరిటీలతో పవన్ బస్సు సిద్ధం చేసుకున్నారు..దానికి వారాహి అని పేరు కూడా పెట్టారు. ఇక ఈ బస్సు రంగుపై వైసీపీ కామెంట్స్ చేస్తూ వస్తుంది. ఆలీవ్ గ్రీన్ కలర్ బస్సుకు ఉందని, అది మిలటరీ వాళ్ళు వాడుతున్నారని, కాబట్టి ఆ రంగు తీయాలని డిమాండ్ చేస్తున్నారు. కావాలంటే పసుపు రంగు వేసుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు.

అయితే ఏమైనా అభ్యంతరాలు ఉంటే రవాణా శాఖ వారు చూసుకుంటారు. కానీ తెలంగాణ రవాణా శాఖ వారాహికి పర్మిషన్ ఇచ్చింది..రిజిస్ట్రేషన్ పూర్తి అయింది..నెంబర్ కూడా వచ్చింది. అలాగే అది ఆలీవ్ గ్రీన్ కలర్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అని రవాణా శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. అయినా సరే వైసీపీ ఇంకో పాయింట్ పట్టుకుంది..తెలంగాణ రిజిస్ట్రేషన్ బస్సు ఏపీలో ఎలా తిరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఏపీ నిబంధనల ప్రకారమే బస్సు తిరగాలని ఆ బస్సు ఏపీలోకి వచ్చాక చెబుతామని మంత్రి అమర్నాథ్ అంటున్నారు.

అంటే ఆల్ ఇండియా పర్మిట్ వస్తే ఎక్కడైనా తిరగవచ్చు అనే సంగతి వైసీపీ వాళ్ళకు తెలిసినట్లు లేదు. అయినా సరే ఎలాగోలా బస్సుని అడ్డుకోవాలని వైసీపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏపీకి వచ్చాక ఏం చేస్తారో చూడాలి.