త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 30వ సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను ఎన్టీర్ పుటిన రోజు సందర్బంగా విడుదల చేయ్యగా ఆ సినిమా పై భారీ అంచనలు క్రియెట్ చేసింది. అయితే ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు పెట్టాలేదు. ఇప్పటికి కొరటాల ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగానే ఉన్నాడు. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తీసుకోబోతున్నారు.
అయతే ఈ పాన్ ఇండియా సినిమా నుంచి వచ్చే అప్ డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ లుక్ కు సందించిన ఒక క్రేజి న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కోత్త లుక్‌ను ట్రై చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ మ్యానరిజమ్ కుడా ఈ సినిమాలో ఎన్టీఆర్ చేతికి ఆరు వేళ్ళు ఉంటాయట.
కోపం వచ్చిన ప్రతిసారి ఆరో వేలు బిగుసుకు పోతుందని.. ఎన్టీఆర్ పాత్ర సీరియస్ నెస్ ను ఈ వేలుతో పలు సందర్భాల్లో సింబాలిక్ గా ఎస్టాబ్లిష్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చే కోత్త సంవత్సరం నుండి మొదలు పెట్టబోతున్నరని తెలుస్తుంది. ఈ సినిమా తొలిషెడ్యుల్‌నే భారిగా ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వేగంగా జరగనుంది. అయితే కథలో కొంత మైథిలాజికల్ టచ్ కూడా ఉంటుందట.
ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ ను తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా చాల డిఫరెంట్ మేకోవర్ ట్రై చేస్తున్నాడు. మొత్తానికి కొరటాల ఈ సినిమా కోసం బాగానే కసరత్తులు చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్- కొరటాల ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటారో ? చూడాలి.