సీమలో ఐప్యాక్..16 ఎమ్మెల్యేలతోన రిస్క్!

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడమే జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి 175కి 175 సీట్లు గెలవాలని టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అలాగే ఎమ్మెల్యేలని గడపగడపకు పంపారు. ఎప్పటికప్పుడు పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుంటున్నారు. పనితీరు బాగోకపోతే సీటు కూడా ఇవ్వనని అంటున్నారు. మొత్తం ఐప్యాక్ టీం సర్వే ద్వారా ఎమ్మెల్యేల భవితవ్యం తేలుస్తున్నారు.

అయితే ఇదే క్రమంలో ఐప్యాక్ టీమ్ సర్వేలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు గురించి ఊహించని వ్యతిరేకత ఎదురవుతుందని తెలుస్తోంది. అసలు వైసీపీకి గట్టి పట్టున్న రాయలసీమలో వైసీపీకి దెబ్బ తగిలేలా ఉందని ఐప్యాక్ సర్వేలో తేలిందట. సీమలో ఉన్న నాలుగు జిల్లాల్లో కలిపి మొత్తం 52 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 49 గెలుచుకోగా, టీడీపీ 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కానీ ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి గడ్డు పరిస్తితి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాకపోతే వైసీపీకి లీడ్ ఉంటుంది గాని..గత ఎన్నికల మాదిరిగా సత్తా చాటడం కష్టమని తేలింది.

తాజాగా ఐప్యాక్ టీం సర్వే ప్రకారం..ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీకి ఎక్కువ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉందట. గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 సీట్లలో వైసీపీ 12, టీడీపీ 2 సీట్లు గెలుచుకుంది. ఇక ఇప్పుడు వైసీపీకి ఉన్న 12 మంది ఎమ్మెల్యేల్లో 6 గురిపై వ్యతిరేకత కనిపిస్తుందట. అటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్వీప్ చేశారు. 14కి 14 గెలుచుకున్నారు. అందులో ఇప్పుడు 4 గురు ఎమ్మెల్యీలపై వ్యతిరేకత ఉందట. అటు ఉమ్మడి చిత్తూరులో 14కి 13 గెలుచుకున్నారు. ఇప్పుడు అందులో నలుగురిపై వ్యతిరేకత ఉందట.

జగన్ సొంత జిల్లా కడపలో 10 సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు అందులో 2 సీట్లలో వైసీపీకి వ్యతిరేకత ఉందట. అంటే టోటల్ గా 16 సీట్లలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇదే పరిస్తితి ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో సీమలో వైసీపీకి లీడ్ తగ్గవచ్చు.