టాలీవుడ్ లో ఉన్న కొందరు స్టార్ హీరోలకి మాత్రం 2022 సంవత్సరం మిస్ చేసుకున్నారు. వారిలో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా గత సంవత్సరం డిసెంబర్ నెలలో తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ఇద్దరి హీరోల రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అలాంటి సూపర్ హిట్ సినిమాలు తర్వాత వారి నుండి సినిమాలు వస్తే అవి కచ్చితంగా విజయాలను దక్కించుకుంటాయని అంతా అనుకున్నారు.
కానీ అయితే ఈ సంవత్సరం వారి నుంచి సినిమాలు రాలేదు. బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్‌లో విడుదల చేద్దాం అని చిత్ర యూనిట్ ప్రకటించారు. కానీ ఆ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడంతో ఆ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అల్లు అర్జున్ కూడా గత సంవత్సరం డిసెంబర్‌లో పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతటి ఘన విజయం సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.
ఆ సినిమాకు సీక్వల్ గా వస్తున్న పుష్ప2 ఈ సంవత్సరం ప్రేక్షకులు ముందుకు రావాల్సి ఉంది. కానీ భారీ అంచనాల మధ్య రూపొందుతున్న సినిమా అవడంతో ఆ సినిమా స్క్రిప్ట్ కాస్త మార్చాలని ఉద్దేశంతో ఏకంగా ఏడాది పాటు ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కు టైం కేటాయించారు. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ మొదలైన ఇప్పటివరకు పూర్తిస్థాయి షూటింగ్ మొదలు పెట్టలేదని సిని వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
అల్లు అర్జున్, బాలకృష్ణ ఈ ఇద్దరి హీరోలు కూడా 2022 సంవత్సరాన్ని మిస్ చేసుకున్నట్లే. అయితే ఈ సంవత్సరం బాక్సాఫీస్ ముందుకు వచ్చి సక్సెస్ నమోదు చేసిన వారిలో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు ఈ సంవత్సరాని ఎంతో సద్వినియోగంగా ఉపయోగించుకున్నారు.