లోకేష్‌తో అనంతలో టీడీపీకి జోష్..ఆ సీట్లలో కలిసొస్తుందా?

నారా లోకేష్ పాదయాత్రకు నిదానంగా క్రేజ్ పెరుగుతుంది. వాస్తవానికి పాదయాత్ర మొదలైనప్పుడు పెద్దగా జనం పట్టించుకోలేదు. ఇక ఏదో ఆయన పాదయాత్ర అలా అలా సాగుతుందిలే అని అనుకున్నారు. మొదలైంది కుప్పం కాబట్టి అక్కడ కాస్త ఊపు కనిపించింది గాని..తర్వాత అంత ప్రభావం కనబడలేదు. కానీ పలమనేరు, పీలేరు లాంటి నియోజకవర్గాల్లో పాదయాత్ర మరో ఎత్తుకు వెళ్లింది. అక్కడ నుంచి పాదయాత్రకు ప్రజా మద్ధతు పెరుగుతూ వచ్చింది. ఇక లోకేష్ ప్రజలతో కలిసిపోయే విధానం నచ్చింది. అన్నీ […]

నెల్లూరు సీట్లపై బాబు క్లారిటీ..ఆ రెండిటిల్లో డౌట్?

ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు వైసీపీకి అనుకూలంగా సాగిన రాజకీయం ఇప్పుడుప్పుడే టి‌డి‌పి వైపు వెళుతుంది. జిల్లాలో వైసీపీ బలం తగ్గుతుండగా, టి‌డి‌పి బలం పెరుగుతూ వస్తుంది. పైగా ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పడం పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ముగ్గురు కూడా రెడ్డి వర్గం ఎమ్మెల్యేలే కావడం మరింత ఎఫెక్ట్ పడుతుంది. ఇక వారు టి‌డి‌పి వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో టి‌డి‌పికి […]

టీడీపీ-జనసేనతో కమ్యూనిస్టులా? కమలమా?

ఏపీలో ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉంది..వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు కలిసి పనిచేయనున్నారు? అంటే ఇప్పుడే ఆ అంశం క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. టీడీపీతో కలిసి జనసేన పొత్తు పెట్టుకోవడానికి రెడీగానే ఉంది. కానీ జనసేన ఏమో బి‌జే‌పితో పొత్తులో ఉంది. బి‌జే‌పి ఏమో టి‌డి‌పితో కలవడానికి సిద్ధంగా లేదు. ఇటు టి‌డి‌పి సైతం జనసేనతో ఓకే గాని..బి‌జే‌పితో పొత్తు అంటే ఆలోచిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో బి‌జే‌పిపై నెగిటివ్ ఉంది. కాకపోతే […]

జగన్ ‘పేద’ కాన్సెప్ట్..మీడియా కూడా లేదే..వర్కౌట్ అవుతుందా?

ఈ మధ్య జగన్ పదే పదే ఒకే కాన్సెప్ట్ తో ముందుకెళుతున్నారు. ఎంతసేపటికి చంద్రబాబు-పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకునే విషయంపైనే విమర్శలు చేస్తున్నారు. ఇక ఆ పొత్తు లేకుండా చేయడానికి దమ్ముంటే 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. అంటే వారు విడిగా పోటీ చేస్తే తమకు లాభమనేది జగన్ కాన్సెప్ట్. ఎలాగో పొత్తు పోయేలా లేదు. ఖచ్చితంగా పొత్తు ఉండేలా ఉంది. అందుకే జగన్ వేరే రూట్ లో వస్తున్నారు. తాను ఒంటరిగా […]

విశాఖ వైసీపీలో కుమ్ములాట..గుడివాడ వర్సెస్ దాడి!

ఏపీలో అధికార వైసీపీ అంతర్గత పోరు ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతలకు పడటం లేదు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలనే దిశగా పనిచేస్తూ..ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. ఇదే క్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా మంత్రి అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లిలో రచ్చ ఎక్కువ గా ఉంది. అక్కడ ఇప్పటికే మంత్రికి నెగిటివ్ ఉంది. ఇదే సమయంలో వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు..మంత్రికి […]

 నూజివీడుకు బాబు..తమ్ముళ్ళ మధ్య పోరు..సెట్ అవ్వరా!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే.ఈ నెల 12 నుంచి ఆయన మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తారు. 12న నూజివీడు, 13న గుడివాడ, 14న మచిలీపట్నంలో పర్యటిస్తారు. ఇక బాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, బహిరంగ సభ ఏర్పాట్లని టి‌డి‌పి నేతలు చూస్తున్నారు. ఇదే క్రమంలో 12న నూజివీడులో జరిగే సభ ఏర్పాట్లని టి‌డి‌పి నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, నూజివీడు టి‌డి‌పి ఇంచర్ ముద్దరబోయిన […]

 ఉరవకొండ బరిలో పయ్యావుల..1994 రిపీట్ చేస్తారా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు నిఓయోజకవర్గాలు పూర్తి చేసుకున్న పాదయాత్ర ప్రస్తుతం ఉరవకొండలో నడుస్తోంది. అయితే లోకేష్ ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ..టి‌డి‌పి అభ్యర్ధులని ప్రకటించేస్తున్నారు. కొన్ని స్థానాల్లో సీట్లు తేల్చడం లేదు గాని..మిగిలిన స్థానాల్లో పోటీ చేసేది ఎవరో తేలుస్తున్నారు. ఇటీవల రాప్తాడులో పరిటాల సునీతమ్మ, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ పోటీ చేయడం ఖాయమని, వారిని గెలిపించాలని కోరారు. ఇప్పుడు ఉరవకొండలో పయ్యావుల కేశవ్ ని […]

 వై నాట్ పులివెందుల..బాబు రివర్స్ కౌంటర్.. వర్కౌట్ అవుతుందా?

వచ్చే ఎన్నికల్లో గెలుపుని సొంతం చేసుకుని అధికారం దక్కించుకోవాలని అటు వైసీపీ, ఇటు టీడీపీ గట్టిగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ..మరొకసారి అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. ఇటు టి‌డి‌పి ఈ సారైనా అధికారం కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఇదే క్రమంలో రెండు పార్టీలు ప్రత్యేక వ్యూహంతో వెళుతున్నాయి. జగన్ ఏమో వై నాట్ 175 అని నినాదంతో ముందుకెళుతూ..దమ్ముంటే టి‌డి‌పి 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. దానికి చంద్రబాబు […]

 పొత్తుపై కల్యాణ్ క్లారిటీ..కమలం చేతుల్లోనే అంతా.!

వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుపై క్లారిటీగానే ఉన్నారు..నెక్స్ట్ ఎన్నికల్లో 2014 కాంబినేషన్ తో వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. అంటే టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి…ఇలా మూడు పార్టీలు కలిసి వెళితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇక ఇదే ప్రతిపాదనని తాజాగా ఢిల్లీలోని బి‌జే‌పి పెద్దల ముందు పెట్టారని తెలిసింది. తాజాగా పవన్ ఢిల్లీకి వెళ్ళిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ పాలనలో జరుగుతున్న అక్రమాలు, అరాచకాలపై ఫిర్యాదు చేశారని, అలాగే రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరినట్లు తెలిసింది. ఇక రాజకీయ […]