టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి టేకప్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఈ క్రమంలోనే సినిమాపై పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ లోనే కాదు నేషనల్ లెవెల్ ప్రేక్షకులను ఆసక్తి మొదలైంది. ఈ మూవీతో పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు జక్కన్న. 2027 మార్చిలో వారణాసి సినిమా రిలీజ్ అని.. ఇప్పటికే హింట్ ఇచ్చేశారు మూవీ మేకర్స్. అయితే రాజమౌళి సినిమా అంటే ఆడియన్స్ లో ఉండే హైప్ లానే.. బిజినెస్ కూడా భారీ రేంజ్ లో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ఓటీటీ డీల్ విషయంలో ఒక సెన్సేషనల్ రికార్డు నమోదయ్య అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు మేటర్ ఏంటంటే.. శ్రీ దుర్గా ఆర్, షోవింగ్ బిజినెస్ బ్యానర్లపై.. కేఎల్ నారాయణ, ఎస్ ఎస్ కార్తికేయ, ఎస్ గోపాల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ వారణాసి.
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీ నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశాడట. తన సినిమాలకు ఎలా మార్కెట్ చేసుకోవాలో జక్కన్నకు తెలిసినంతగా ఇండస్ట్రీలో మరెవరికి తెలియదు. ఇప్పటికే తనదైన స్టైల్ లో ప్రమోషన్స్ మొదలుపెట్టి అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. సెట్స్‌పై సినిమా ఉండగానే థియేట్రికల్, నాన్ థియేటర్ల్ బిజినెస్‌లు భారీగా జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీ లో గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ ప్రచార హక్కులు హాట్‌స్టార్‌కు భారీ ధరకు విక్రయించిన మేకర్స్.. ఇప్పుడు వారణాసి రిలీజ్ అయ్యే నాటికి ప్రెస్ మీట్ లు, ఈవెంట్లు మిగతా ప్రమోషన్స్ కూడా భారీ డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వారణాసి థియేట్రికల్ రైట్స్‌కి భారీ డిమాండ్ ఏర్పడింది.
కేవలం తెలుగు రాష్ట్రాలు కాదు హిందీ, తమిళ్, కర్ణాటక, కేరళ, ఓవర్సీస్ ఎలా అన్ని చోట్ల సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే డిజిటల్ సాటిలైట్ ఆడియో రైట్స్ కూడా భారీ ధరకు కొనుగోలు చేసినందుకు పెద్ద కంపెనీలు సైతం సిద్ధంగా ఉన్నాయి. అయితే.. వారణాసి ఓటీటీ డీల్ కు సంబంధించిన ఓ క్రేజి న్యూస్ నెటింట చక్కర్లు కొడుతుంది. తాజా సమాచారం ప్రకారం వారణాసి డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకునేందుకు దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చిందట. దాదాపు 750 కోట్ల నుంచి 1000కోట్ల వరకు ఖర్చు చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇండియాలో అన్ని భాషలతో కలుపుకొని గ్లోబల్ రైట్స్ కోసం ఏ రేంజ్ లో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియదు గాని.. అదే నిజమైతే మాత్రం వారణాసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే భారీ ధరకు ఓటీటీ హక్కులను అమ్మిన రికార్డ్ క్రియేట్ చేస్తుంది.



