టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతునే.. మరోపక్క సినిమాల కోసం సెట్స్ లోను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది పవన్ నుంచి వరుసగా ఒకటి కాదు రెండు సినిమాల రిలీజ్ అయ్యాయి. వాటిలో హరిహర వీరమల్లు ఒకటి కాగా.. మరో మూవీ ఓజి. వీరమల్లు సినిమా ఆడియన్స్‌ను నిరాశ పరిచిన.. ఓజీ మాత్రం ఫ్యాన్స్‌కు కావలసిన ఫుల్ స్టాప్ అందించింది. భారీ బ్లాక్ బస్టర్ అయ్యింది. సుజిత్ స్టైలిష్ టేకింగ్, మ్యూజిక్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయని చెప్పాలి. పవన్ ను ఫ్యాన్స్ ఎన్నో ఏళ్ల నుంచి చూడాలనుకున్న విధంగా చూపించాడు అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఈ సినిమాలో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా మెప్పించగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. శ్రియ రెడ్డి, శుభలేఖ సుధాకర్, ప్రకాష్ తదితరులు కీలకపాత్రలో మేరిశారు. మొత్తానికి సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్ లోనే సినిమాకు మంచి రికార్డ్‌లు దక్కాయి. దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు కొలగొట్టి.. బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ఓజీ డైరెక్టర్ కోసం పవన్ చేసిన పని హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఓజీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో డైరెక్టర్ సుజిత్ కు ఓ లగ్జరీ.. కాస్ట్లీ కార్ గిఫ్ట్ గా ఇచ్చాడట పవన్ కళ్యాణ్. ప్రముఖ కార్ల కంపెనీ ల్యాండ్ రోవర్‌కు చెందిన రేంజ్ రోవర్‌ను సుజిత్ కు ఆయన ప్రజెంట్ చేశాడట. ఈ విషయాన్ని సుజిత్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
![]()
దీనికి సంబంధించిన ఫొటోస్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ పోస్ట్‌ని సుజిత్ షేర్ చేసుకుంటూ.. తను అందుకున్న బహుమతుల్లో అత్యుత్తమమైన.. గిఫ్ట్ అంటూ సుజిత్ ఎమోషనల్ అయ్యాడు. మాటల్లో చెప్పలేనంత ఆనందం, కృతజ్ఞత భావంతో మనస్సు నిండిపోయింది. నాకు అత్యంత ప్రేమ అయిన నా ఓజి.. పవన్ గారి నుంచి ఇంత ప్రేమ, ప్రోత్సాహం దక్కడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి నుంచి ఆయన ఫ్యాన్‌గా మొదలైన నా జర్నీ.. స్పెషల్ మూమెంట్తో మరింత మధురంగా మారింది అంటూ సుజిత్ షేర్ చేసుకున్నాడు. జీవితంలో ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను అంటూ రాసుకోచాడు. ప్రస్తుతం సుజిత్ నోట్ తో పాటు ఫొటోస్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

