అఖండ 2 నార్త్ లో పరిస్థితి ఏంటంటే..?

బాలకృష్ణ – బోయపాటి కాంబోలో వ‌చ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన అఖండ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు నార్త్‌ ఆడియన్స్ ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అసలు ఊహించని విధంగా విరగబడి సినిమాను చూసారు. డివైన్ ఎలివేషన్స్‌తో సినిమా చాలా రోజులపాటు ఆడ్ ఇన్ స్పీక్స్ లెవెల్ లో ఎంజాయ్ చేశారు. ఈ సినిమా తర్వాత కాంతారా రెండు పార్ట్‌లు మంచి రెస్పాన్స్ ద‌క్కించుకున్నాయి. ఈ క్రమంలోనే అఖండ 2ను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేశారు.

హిందీ ఆర్టిస్టులను సైతం తీసుకుని సినిమాల రూపొందించారు. డబ్బింగ్ సైతం చాలా శ్రద్ధగా చేశారు. ముంబైకి వెళ్లి భారీ లెవెల్ లో ప్రమోషన్స్ పెట్టారు. అక్కడ అఖండ 2 బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని.. రికార్డులు క్రియేట్ చేస్తుందని అంత నమ్మారు. కానీ.. అవేమీ వర్కౌట్ కాలేదట. అక్కడ తెలుగులో ఊహించిన రెస్పాన్స్ రాకపోవడం మిక్స్డ్‌ టాక్‌తో మొదటి వీకెండ్‌లో భారీ కలెక్షన్స్ దక్కిన తర్వాత.. కలెక్షన్స్ వీక్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక హిందీ వర్షన్ అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉందట. అఖండ‌ సినిమాకు సరైన రిలీజ్ ద‌క్క‌లేదు సరి కదా.. నార్త్ ఇండియా మొత్తం కలిపితే హిందీ షోలు 100 కూడా లేవట. మొంబాయి, ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో పట్టుమని 100షోలు కూడా ఇవ్వట్లేదు. అఖండ 2 హిందీ వర్షన్ రెస్పాన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది.

లేటెస్ట్ గా రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ దురంధర్ పాజిటివ్ రెస్పాన్స్ రావడం మరింత మైనస్ గా మారింది. ప్రధాన నగరాల్లో అయితే వీకెండ్స్ లో కూడా కనీసం ఆక్యుపెన్సీ కనిపించట్లేదు. వీక్ డేస్ వచ్చేసరికి పూర్తిగా థియేటర్స్ ఖాళీగా ఉంటున్నాయి. అందుబాటులో ఉన్నదే కొన్ని షోలైనా.. కనీసం జనం రాని పరిస్థితి. అఖండ 2 పట్ల.. నార్త్ ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని క్లారిటీ వచ్చేసింది. టాక్ పాజిటివ్ గా వచ్చుంటే.. కలెక్షన్లు పుంజుకునేవేమో కానీ.. అది జరగట్లేదు. డివైన్ ఎలిమెంట్స్ ఉన్న ఓవరాల్ గా అక్కడి ఆడియన్స్ సినిమాకు కనెక్ట్ కాకపోవడంతో హిందీ తో నార్త్ వెర్షన్ ప్రభావం చూపకుండానే థియేటర్ల నుంచి గుడ్ బై చెప్పేలా ఉంది.