అఖండ 2.. శివుడిగా బాలీవుడ్ పాపులర్ యాక్టర్.. మొదట్లో ఏం చేసేవాడంటే..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో అఖండ 2 మ్యానియా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా.. అఖండ 2 వార్తలు.. మారుమోగిపోతున్నాయి. నందమూరి నట‌సింహం బాలయ్య నట విశ్వరూపం చూపించడంటూ.. ముఖ్యంగా పరమేశ్వరుని గుర్తుచేసేలా బాల‌య్య రుద్రతాండవం.. అభిమానులకు ఫుల్ ట్రీట్ అంటూ అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. అఖండలో శివతత్వం గురించి ప్రస్తావన ఉన్న సంగతి తెలిసిందే. ఇక సినిమా క్లైమాక్స్ సీన్స్ లోనూ శివుని గుర్తు చేసేలా ఓ సీను డిజైన్ చేశారు. ఇప్పుడు సీక్వెల్ అఖండ 2 తాండవంలో ఏకంగా పరమశివుడే కైలాసం నుంచి దిగివచ్చాడు. ఇంతకీ అంతటి పవర్ఫుల్ పాత్రలో నటించినా న‌ట్టుడు ఎవరు.. అతని బ్యాగ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం.

అతని పేరే తరుణ్ ఖ‌న్నా. అఖండ 2 తాండవంలో పరమశివుడిగా ఆడియన్స్ లు ఫిదా చేసిన ఇతను ఇంతకుముందు కూడా శివునిగా ఎన్నో సందర్భాల్లో నటించాడు. మైథాలాజికల్ టీవీ సిరీస్ సంతోషి మా సీరియల్ మొదటిసారి శివునిగా కనిపించిన తరుణ్ ఖ‌న్నా.. తర్వాత కర్మ ఫల్‌ధాత శ‌నీ, పరమావతార శ్రీకృష్ణ, శ్రీమద్రామాయణం, కాలభైరవ రక్షక శక్తిపీఠ్ కే.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సీరియల్లో పరమశివుడి పాత్రలో మెరిశాడు. ఇప్పుడు అఖండ 2 తాండవంతో తెలుగు ఆడియ‌న్స్‌ను ప‌ల‌క‌రించాడు. అలవాటైన పాత్ర ఇంతకుముందు చేసిన అనుభవంతో.. తరుణ్ ఈ పాత్రలో జీవించేసాడు.

Tarun Khanna: Playing Lord Shiva has brought changes in my life - Times of India

ఈయన పేరు చెప్తే చాలు.. శివుని గెటప్ ఏ గుర్తుకొస్తుంది. ఇక.. బాలీవుడ్ ఆడియన్స్ కు ముందుగా గుర్తుకొచ్చేది రాధాకృష్ణ సీరియల్. తరుణ్ ఖ‌న్నాకు మంచి పాపులారిటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే అఖండ 2లో శివుడుగా తరుణ్ కనిపించడంతో నార్త్ ఆడియన్స్లను సినిమాపై హైట్ పెరుగుతుంది. బాలయ్యతో.. తరుణ్ ్‌న్నాకు పెద్దగా సీన్స్ లేవు. అయినా.. ఒక సన్నివేశంలో ఇద్దరు కలిసి కనిపించారు. అది ఎలానో తెలియాలంటే థియేటర్లలో సినిమా చూడాల్సిందే. సీరియల్స్ మాత్రమే కాదు.. తరుణ్ ఖ‌న్నా.. గతంలో ఎన్నో స్టేజ్ షోలు కూడా శివుడి గెటప్ లో చేశారు.