అఖండ 2 రివ్యూ.. బాలయ్య రుద్ర తాండవం..!

గాడ్‌ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో తెరకెక్కిన నాలుగవ‌ మూవీ అఖండ 2. ఫ్యాన్స్ ఎదురుచూపులకు చెక్ పెడుతూ ఈ సినిమా నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇక నిన్న రాత్రి ఈ సినిమా ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయిపోయాయి. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన క్ర‌మంలో ఈ సినిమాపై ఆడియన్స్ మొదటి నుంచి అంచనాలు ఆకాశాన్నికంటిన‌ సంగతి తెలిసిందే. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంది.. బాలయ్య రుద్రతాండవం ఏ రేంజ్ లో ఉంది.. సినిమాతో బాలయ్య ఖాతాలో మరో హిట్ పడిందా లేదా.. రివ్యూ లో చూద్దాం.

స్టోరీ:
అఖండ లో.. దుష్టసంహారం చేసిన తర్వాత తమ్ముడి కూతురికి ఏదైనా ఆపద వస్తే మళ్ళీ వస్తానని.. అఘోర చెప్పాడు. అలా.. హిమాలయాలకు వెళ్లిపోయిన అఘోర అక్కడ ఓ సాధువు (మురళీమోహన్) శివ సన్నిధి కోసం, దేశం కోసం తపస్సు చేయమని ఇచ్చిన స‌ల‌హాతో ఒంటి కాలుపై కఠిన తప్పస్సు చేస్తూ ఉంటాడు. ఇక అదే దేశంలో మ‌రో ప‌క్క ప్రధాని పదవి కోసం ప్రతిపక్ష నాయకుడు కుట్రలు మొదలవుతాయి. దేవుడు ఇండియను కాపాడతాడు అని నమ్మే ప్రధానితో.. దేవుడు లేడని ప్రజలు చెప్పేలా చేస్తారు.

అందుకు దేశద్రోహులైన చైన‌, ట్రిబెట్ దేశాలతో చేతులు కలుపుతాడు. వారి పన్నాగంతో ఇండియాలో కుంభమేళ జరుగుతున్న సమయంలో.. గంగా నదిలో బయో వేపన్‌తో నీటిని విషం గా మార్చేశాడు. దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. దానికి విరుగుడు కోసం సైంటిస్టులు, డిఆర్డిఏ సిబ్బంది ఎంతగానో కష్టపడి సక్సెస్ అవుతారు. దానిని దక్కించుకోవడానికి.. ప్రతిపక్ష నాయకుడు చేసిన పన్నాగం.. అఘోర కారణంగా రివ‌ర్స్ అవుతుంది. ఇదంతా ఎలా జరిగింది.. దేవుడు రూపంలో అఘోర మళ్లి ఎలా వచ్చాడు.. దేశ ర‌క్ష‌ణ‌కు ఏం చేశాడు అన్నదే మిగిలిన స్టోరీ.

Balakrishna pairs with Samyuktha Menon; age-gap debate reignitesరివ్యూ:
అఖండ తాండవం టైటిల్ కు తగ్గట్టుగానే.. బాలయ్య రుద్రరూపం చూపించాడు. అది తప్ప స్టోరీలో అసలు బస లేదనిపించింది. అఖండకు రీప్లేస్ గా కథ‌ ఉంది. కానీ స్టోరీ స్ట్రాంగ్‌గా అనిపించ‌లేదు. ఎమోషన్స్ ఆకట్టుకోలేదు.. మదర్ సెంటిమెంట్ అసలు వర్కర్ కాలేదని ఫీల్ కలుగుతుంది. కేవలం చైనా దేశాన్ని దుష్ట దేశంగా చూపించే విధంగా బోయపాటి కాన్సెంట్రేట్ చేసాడు.. ఇక దుష్ట శ‌క్తుల‌ను తన ఆధీనంలో ఉంచుకున్న వ్యక్తిగా ఆది పిన్నిశెట్టి ఆకట్టుకున్నాడు. తండ్రి చావుకు కారణమైన ఆఘోరను చంపే క్రమంలో ఆది, అఘోర పాత్రలకు మధ్యలో వచ్చే ఫైట్స్ ఆడియన్స్ మెప్పిస్తాయి.

చైనా జనరల్ సైనికులతో, ప్రతిపక్ష నాయకుడు రౌడీలతోనూ స్ట్రాంగ్ యాక్షన్ ఫైట్స్ డిజైన్ చేశాడు. అంతకుమించి సినిమాలో హైలెట్స్ అని చెప్పుకునేలా పెద్దగా ఏమీ కనిపించలేదు. కథలో పసలేకుండా బోయపాటి కసరత్తులు చేసి ఉపయోగం ఏముంది.. ఇక ఇండియాపై చైనా బయోవార్ సన్నివేశాలు చూస్తుంటే.. సెవెంత్ సెన్స్ సినిమా గుర్తుకొచ్చింది. అక్కడ కుక్క‌పై వైరస్ వాడుకుంటే.. ఇక్కడ కుంభమేళా గంగా నది నీళ్లు వాడారంతే అనిపించింది. ఇక దేవుడి గురించి.. దేవుడిపై నమ్మకాన్ని గురించి అఘోర సినిమాలో చెప్పే డైలాగ్స్ ఉన్నట్టే అఖండ 2 లోను అలాంటి డైలాగ్సే వాడారు.

Akhanda 2 teaser: Nandamuri Balakrishna's 'cringe' scenes leaves internet divided: 'Even Bhojpuri cinema is ashamed' | Mint

చాలా సన్నివేశాలు అఖండలో చూసినట్లే అనిపిస్తాయి. ఈ క్రమంలోనే సీన్స్‌ పెద్దగా క్లిక్ అవలేదు. ఇక ఫస్ట్ పార్ట్‌ జగపతిబాబు రోల్ ప్లేస్ లో.. ఇప్పుడు మురళీమోహన్ ను పెట్టారు. ఇక బాలయ్య‌.. మరో పక్క ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ రోల్ లో నటించాడు. ఇంట్లో ఫంక్షన్ లో సంయుక్త డ్యాన్స్ చూపించారు. సినిమాలో మిగతా పాత్రలు చాలానే ఉన్నా వాటి ప్రజెన్స్‌ పెద్దగా కనిపించలేదు. ఇక సినిమాకు అంత ఇంతో ప్లస్ అయింది థ‌మన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి. శివతాండవం ఓకే. తల్లి చనిపోతే ఏకంగా శివుడే అఖండ రూపంలో వచ్చాడన్నది కాస్త ఓవర్ గా అనిపించింది. అక్కడ సంభాషణలు లాగ్‌ ఫీల్ కలుగుతుంది. ఇక మరో పక్కన శివతాండవం చేసే సన్నివేశాలు కూడా పెద్దగా కనెక్ట్ కాలేదు.

నటీనటుల పర్ఫామెన్స్:
మేకర్స్ మొదటి నుంచి చెప్తున్నట్లే బాలయ్య రుద్రరూపం చూపించాడు. ఎమ్మెల్యే బాలమురళీకృష్ణగాను బాలయ్య‌ తన పాత్ర నడవిలో మెప్పించాడు. ఇక ఆదిపెనిశెట్టి పిశాచి గణాలను ఆదినంలో పెట్టుకున్న నెగిటివ్ ప‌వ‌ర్‌గా ఆకట్టుకున్నాడు. వీళ్ళిద్దరూ మధ్య వచ్చే ఫైట్స్ సినిమాకు హైలెట్, బాలయ్యకూతురి పాత్రలో హ‌ర్షాలి మల్హోత్రా నటన ఆకట్టుకుంది. ఇక సంయుక్త మీనన్‌ కేవలం సినిమాలో ఓ సాంగ్ కోసమే చేసినట్టు ఉంది. సినిమాలో మరి కొంతమంది నటులు కనిపించినా.. వారి ప్రజెన్స్‌ స్క్రీన్ పై పెద్దగా కనిపించలేదు.

Nandamuri Balakrishna's Akhanda 2 Movie Gallery, HD Stills

టెక్నికల్గా:
సిజి, విఎఫ్ఎక్స్ పైన పూర్తి సినిమా ఆధారపడిపోయింది. ఓ దశలో.. కొన్ని సీన్స్ చూస్తుంటే.. క‌ల్కి సినిమా చూసే ఫీల్ కలుగుతుంది. డైలాగ్స్ బలంగా రాసుకున్న‌.. బోయపాటి కథపై కూడా కైస‌ర‌త్తు చేయాల్సింది. ఓవరాల్‌గా సినిమా గాడి తప్పిందని చెప్పాలి. కేవలం బాలయ్య కోసమే బోయపాటి సినిమా తీసినట్టు ఉంది. థ‌మన్ మాత్రం ఎప్పటిలాగే తన ఫుల్ ఎఫర్ట్స్‌ పెట్టే సినిమాకు మ్యూజిక్ అందించాడు.

ప్లస్ లు:
సినిమా ఇంట్రడక్షన్ ఆకట్టుకుంటుంది.
థ‌మన్ బీజీఎం ఆడియన్స్‌కు పూన‌కాలు తెప్పిస్తుంది.
ఇంటర్వెల్ బ్యాంగ్‌, క్టైమాక్స్ ఫైట్స్‌ సినిమాకు ప్ల‌స్ అయ్యాయి.

మైనస్ లు:
ఫస్ట్ ఆఫ్ ఫ్లాట్ నరేషన్..సాగదీతగా అనిపించింది.
కంటెంట్ వీక్ గా ఉంది.
ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు.

Balakrishna's Akhanda 2: Censor talk suggests a mammoth hit at the PAN India level

ఫైనల్ గా:
సినిమాలు కేవలం సనాతన ధర్మం కోసమే తీశారు. లాజిక్స్ ఆలోచించకుండా యాక్షన్ సీన్స్ చూస్తూ ఉండడమే. సినిమా కేవలం బాలయ్య కోసమే చూసే వాళ్లకు ఓకే.

రేటింగ్:2.7/5