అఖండ 2 ట్విట్టర్ రివ్యూ.. ఆ 4 ఫైట్స్ సినిమాకు హైలెట్.. ఓవరాల్ గా..!

బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ తాండవం.. తాజాగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకుంది. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. ఈ క్రమంలోనే సినిమా సెట్స్‌ పైకి వచ్చినప్పటి నుంచి ఆడియన్స్‌లో పిక్స్ లెవల్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా మొదటి డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా ప‌డి.. డిసెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ క్రమంలోనే.. డిసెంబర్ 11 రాత్రి నుంచి ప్రీమియర్స్ పడ్డాయి. ఇక బాలయ్య ఫ్యాన్స్ అంచనాలను అందుకున్నాడా లేదా.. బాక్స్ ఆఫీస్ దగ్గర రుద్రతాండవమేనా.. ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

బాలయ్య రుద్ర తాండవం చూపించాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అఘోర గెటప్ లో బాలయ్య ఆరా, డైలాగ్ డెలివరీ, ఫైట్ సీన్స్.. స్క్రీన్ పై ఉత్సాహాన్ని డబల్ చేశాయని.. ముఖ్యంగా అఖండ ఇంట్రడక్షన్ ఫైట్ సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించే లెవెల్ లో ఉన్నాయంటూ చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందట. అలాగే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ల ఫైట్స్‌కు థియేటర్లు బద్దలవడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక డివోషనల్ మూమెంట్తో థియేటర్ లో నుంచి ఆడియన్స్‌ బయటకు వస్తారట.

సినిమా మొత్తంలో బిగ్గెస్ట్ హైలెట్ థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. దాని గురించి ఎంత మాట్లాడిన తక్కువే అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. స్టోరీ మాత్రం వీక్ గా ఉందని.. ఫస్ట్ హాఫ్ సాగదీతగా అనిపించిందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్, డైలాగ్స్ మాత్రం కచ్చితంగా ఆకట్టుకుంటాయని చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్ర ఎన్నో ఏళ్ల పాటు గుర్తుండిపోయేలా ఉందట‌. మూవీలో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటన, డ్యాన్స్ స్టెప్పులు అదిరిపోయాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

విలన్ గా ఆది పిన్నిశెట్టి ఎంట్రీ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిందట. మరికొందరు బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన అత్యంత వీక్ కంటెంట్ ఇదేనంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అఖండ రేంజ్ లో అఖండ 2 లేదంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ట్విట్టర్ రివ్యూ లతో మిక్స్డ్ రెస్పాన్స్ త‌క్కించుకున్న ఈ సినిమా.. ఫుల్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.