ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న న్యూస్ అఖండ 2 వాయిదా. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, బోయపాటి శీను డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. సినిమా బుకింగ్స్ ఓపెనై.. రికార్డు లెవెల్లో టికెట్లు కూడా అమ్ముడుపోయాయి. అయితే.. చివరి క్షణంలో సినిమా వాయిదా పడడం నందమూరి అభిమానులకే కాదు.. ఇండస్ట్రీకి కూడా బిగ్ షాక్‌గా మారింది. ఈ క్రమంలోనే.. బాలయ్య అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. చాలామంది అభిమానులు మేకర్స్ పై తెగ ఫైర్ అయిపోతూ.. బండబూతులు తిట్టిపోస్తున్నారు. అయితే.. ఈ రిలీజ్ సమస్య బాలయ్య కెరీర్లోనే ఓ చెరగని ముద్రగ మిగిలిపోయిందని అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
ఈ క్రమంలోనే.. బాలయ్య సైతం మరోసారి రిలీజ్ విషయంలో ఎలాంటి జాప్యం తలెత్తకుండా.. అభిమానులు డిసప్పాయింట్ కాకుండా.. చూసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. ఈ క్రమంలోనే.. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నట్టు టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారుతుంది. ఇక.. బాలయ్య కమిట్ అయ్యే ప్రతి సినిమాకు సంబంధించిన అన్ని అంశాలను ముందుగానే క్లియర్ కట్ గా పరిశీలించి.. తర్వాతే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. తను చేయబోయే సినిమా బ్యానర్ పై అంతా ఇన్వెస్టిగేట్ చేసి.. క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట.
బ్యానర్ పై ఉండే ఫైనాన్స్.. మునుపటి సినిమాలో పెండింగ్ బకాయిలు.. డిస్ట్రిబ్యూషన్ సమస్యలు.. ఇతర హీరోలకు బ్యానర్ ద్వారా ఏదైనా ఇబ్బందులు తలెత్తయ.. ఈ సందేహాలనింటికి సమాధానాలు దొరికిన తర్వాతనే.. సినిమాకు సైన్ చేయాలని ఆయన ఆలోచన చేస్తున్నాడట. ఈ వ్యవహారాలన్నీ.. పరిశీలించేందుకు ఒక స్పెషల్ టీం కూడా సిద్ధం చేశాడని తెలుస్తుంది. అఖండ 2 రిలీజ్ విషయంలో జరిగిన తప్పు, గందరగోళం మళ్లీ రిపీట్ కాకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో వాస్తవం ఎంత తెలియదు కానీ.. బాలయ్య తీసుకున్న ఈ నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.


