స్టార్ కమెడియన్ ఇమ్మానుయేల్కు ఆడియన్స్లో పరిచయాలు అవసరం లేదు. మొదట పటాస్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇమ్ము.. తర్వాత జబర్దస్త్ కంటెస్టెంట్గా మారి ఎంతమందిని కడపుబ్బనవ్వించాడు. ఈ క్రమంలోనే స్టార్ కమెడియన్ గాను మారాడు. ఇక జబర్దస్త్లో.. వర్ష, ఫైమాలతో నడిపిన లవ్ ట్రాక్ నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకోవడంతో.. మంచి ఫేమ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే వర్షతో నిజంగానే ఏమని లవ్ లో ఉన్నడంటూ పలు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే.. అవన్నీ కేవలం కంటెంట్ కోసమేనని క్లారిటీ వచ్చేసింది. జబర్దస్త్ తర్వాత.. తర్వాత పలు సినిమాలోని అవకాశాలు దక్కించుకుని తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం ఇమ్మన్యూయేల్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇమ్ము.. తన కామెడీతో.. హౌస్ మెట్లనే కాదు, షో చూసే ఆడియన్స్ ని కూడా మెప్పించాడు. టాస్క్ లోను గట్టి కాంపిటీషన్ ఇస్తూ సత్తా చాటుకున్నాడు. ఇక హౌస్ లోకి అడుగు పెట్టక మునుపే తనకు ఒక లవర్ ఉందట. ఈ విషయాన్ని స్వయంగా ఇమ్ము బిగ్ బాస్ వేదికగా షేర్ చేసుకున్నాడు, అయితే,, తనకు కాబోయే భార్య ఎవరు,, ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో మాత్రం రివీల్ చేయలేదు, తాజాగా,, ఇమ్ము అన్న వంశీ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె గురించి వివరించాడు.
ఇమ్ము వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను క్లారిటీ ఇచ్చాడు. ఇమ్మాన్యువల్ కు గర్ల్ ఫ్రెండ్ ఉంది. కానీ.. ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. నాకు మాత్రమే తెలుసు. ఇమాన్యుల్ బిగ్ బాస్ లో ఉన్నాడు. కనుక సోషల్ మీడియాలో చాలామంది ఎవరెవరు అమ్మాయిల ఫోటోలు పెట్టి ఈమె అతని గర్ల్ ఫ్రెండ్ అంటూ రాసేస్తున్నారు. నన్ను కూడా ట్యాగ్ చేస్తున్నారు. కానీ.. ఆ అమ్మాయి ఇబ్బంది పడకూడదని ఆమె ఎవరో మేము రివీల్ చేయడం లేదు. తను ఒక డాక్టర్. స్టడీస్ కంప్లీట్ చేయడానికి బయటకు వెళ్ళింది. ఆమెకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదనే ఇలా సీక్రెట్ మైంటైన్ చేస్తున్నాం. హౌస్ నుంచి ఇమ్మానుయేల్ వచ్చిన తర్వాత తనకు కాబోయే భార్య ఎవరో ఇమ్మునే అనౌన్స్ చేస్తాడు. అంతేకాదు.. వీళ్ళిద్దరి పెళ్ళికి రెండు ఫ్యామిలీలు ఒప్పుకున్నాయని.. ఇమ్ము రాగానే ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేస్తామంటూ వంశీ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం వంశీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో.. తమ ఫేవరెట్ కమెడియన్.. ఓ డాక్టర్ను వెళ్లడబోతున్నాడని సంతోషని వ్యక్తం చేస్తు.. ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు ఫ్యాన్స్.



