ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్.. ‘ ఉస్తాద్ భగత్ సింగ్ ‘ రిలీజ్ డేట్ రివీల్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క ఏపీ డిప్యూటీ సీఎంగా.. రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతూనే.. మరో పక్క ఖాళీ దొరికినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్.. పవన్ కాంబోలో ఉస్తాద్‌ భగత్ సింగ్ తెరపైకి రానుంది. ఇక.. ఈ సినిమా ప్రారంభించిన తర్వాత పాలిటిక్స్ కారణంగా షూట్‌కు లాంగ్ గ్యాప్ వచ్చినా.. హరిష్ శంకర్ దానిని వేగంగానే కంప్లీట్ చేశాడు. చివరికి సినిమా షూటింగ్ క్లైమాక్స్ వ‌ర‌కు చేరింది. పవన్ కూడా తన పోర్షన్‌ను ఎప్పుడో కంప్లీట్ చేసేసాడు.

షూటింగ్ పరంగా పవన్‌తో అవసరం లేదు. మ‌ళ్లి డబ్బింగ్.. ప్రచారం బండ్లు మొదలుపెట్టే వరకు ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌ పవన్ కళ్యాణ్ చూడాల్సిన అవసరం లేదు. ప్రస్తుత హ‌రీష్ పెండింగ్ షూటింగ్ కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు. అలాగే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించాడు. ఇదేమి భారీ యాక్షన్ సినిమా కాదు కనుక.. నిర్మాణ‌ పనులకు పెద్దగా టైం అవసరం లేదు. దాదాపు నెల రోజుల్లో సినిమా పనులన్నీ పూర్తయిపోతాయి. ఇక ఈ ప‌నుల‌ని పూర్తైన వెంట‌నే.. ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు హరీష్ ప్లాన్ సిద్ధం చేశాడట.

Pawan Kalyan Unveils Stylish 'Ustad Bhagat Singh' Poster Ahead of Birthday,  Fans Call Him 'Michael Jackson' - Bolly Orbit

ఈ క్రమంలోనే.. డిసెంబర్‌లో లిరికల్ సాంగ్ రిలీజ్ చేయనున్నార‌ని సమాచారం. ఇక.. మేకర్స్ గతంలోను డిసెంబర్‌లో అభిమానులకు ట్రీట్ ఉండ‌నుందంటూ పోస్ట్లు షేర్ చేసుకున్నారు. ట్రీట్ లిరికల్ సాంగ్ రిలీజ్ మాత్రమేనా లేదా.. అంతకంటే బిగ్‌ అప్డేట్ మ‌రేదైనా ఉందా.. గ్లింప్స్, టీజర్ లాంటివి వదులుతారా అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఇలాంటి క్రమంలో.. కొన్ని గంటలకు సంబరాలకు సిద్ధమవండి అంటూ మేకర్స్ వెల్లడించారు. దీంతో.. డైరెక్ట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేస్తారా అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. అయితే.. దాదాపు ఈ సినిమా స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయాలని టీం చూస్తున్నారట. ఫిబ్రవరి, మార్చ్ ఎగ్జామ్స్ సీజన్ కనుక.. పెద్దగా సినిమాలు రిలీజ్ అవ్వవు. ఈ క్రమంలోనే ఏప్రిల్ నుంచి ఉస్తాద్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.