బాల‌య్య ” అఖండ 2 ” రిలీజ్ కోసం ఓ అభిమాని ఏకంగా అన్ని కోట్లు ఇచ్చాడా..?

ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోలుగా సక్సెస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అయితే.. చాలామంది స్టార్ హీరోలు సినిమాల్లో నటించే ఫైట్, యాక్ష‌న్ సీన్స్‌ నేచురల్‌గా లేకపోయినా.. యాక్షన్ సీన్స్ అతిగా అనిపించినా.. ఎన్నో విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుంది. కానీ.. ఒక్క బాలయ్య సినిమాల్లో మాత్రం ఇవన్నీ చాలా న్యాచురల్ గా ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆయన ఏది చేసినా అద్భుతమే. యాక్షన్ సీన్స్ లో బాలయ్యను ఎవరు విమర్శించే సాహసం కూడా చేయరు. కారణం బాలయ్య అంటే అందరూ అభిమానించే తీరు. కొంతమంది ఆయన సినిమాలను చూసి రిలాక్స్ అవుతుంటే.. మరి కొంతమంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

Fans travelled 475 km for Akhanda 2 only for Balakrishna film to be postponed; producer pressured for new release date | Hindustan Times

అలాంటి బాలయ్య – బోయపాటి నుంచి అఖండ 2 సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఫైనాన్షియల్ సమస్యలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ప్రొడ్యూసర్లు రామ్ అచంట, గోపి ఆచంట ఇద్దరు ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు రూ.50 కోట్ల వరకు అప్పు చెల్లించాల్సి ఉందని.. ఆ ప‌ని చేస్తే కానీ.. సినిమా రిలీజ్ చేయడానికి కుదరదు అంటూ కోర్ట్ ను ఆశ్ర‌యించ‌గా కోర్ట్ కూడా దానికి అనుమతిస్తూ సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ ఆ డబ్బు చెల్లించే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. అయితే సినిమా రిలీజ్ వాయిదా పడడంతో బాలయ్య అభిమానులంతా తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Akhanda 2': Release of Nandamuri Balakrishna's film postponed, makers issue statement - The Hindu

ఇప్పటికి సినిమా రివ్యూ కూడా వచ్చేసి ఉండేదని.. అలాంటి సినిమాను చివరి క్షణంలో ఆపేసారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇందులో భాగంగానే ఓ బాలయ్య అభిమాని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వాళ్లకు నాలుగు కోట్ల రూపాయల చెక్‌ను అవలీలగా రాసి ఇచ్చేసాడట. ఇక ప్రస్తుతం ఈ చెక్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి ఆడియన్స్ బాలయ్యను ఏ రేంజ్ లో అభిమానిస్తారో తెలియడానికి ఇదే సరైన ప్రూఫ్ అంటూ.. ఇండియాలో ఏ హీరోకి లేని రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ బాలయ్యకే సొంతం అంటూ ఫ్యాన్స్ సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలయ్య సైతం తన అభిమానుల నిరాశను చూడలేక.. వీలైనంత త్వరగా సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు.. ఎలా అనౌన్స్ చేస్తారో వేచి చూడాలి.