ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలో నిర్మించడమే పెద్ద టాస్క్ అంటే ఆ సినిమాను అనుకున్న టైంకు రిలీజ్ చేయడం మరింత కష్టమైపోయింది. సినిమా సెట్స్ పై ఉన్నప్పటి నుంచి రిలీజ్ అయ్యే ముందు క్షణం వరకు కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సినిమా రిలీజ్ డేట్ పై ఆ ప్రభావం పడిపోతుంది. ఎంత ప్లాన్ చేసిన అనుకున్న టైంకు మూవీ రావట్లేదు. ఇటీవల కాలంలో ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజై.. డేట్ అనౌన్స్ చేసిన తర్వాత వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా.. బాలకృష్ణ, బోయపాటి కాంబో లో తెరకెక్కిన అఖండ 2 కు సైతం ఇదే పరిస్థితి నెలకొంది. రిలీజ్‌కు కొద్ది గంటల ముంతే.. సినిమా అనుహ్యంగా వాయిదా పడింది.
డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా చివరి క్షణాల్లో ఆగిపోవడం ఫ్యాన్స్ కు బిగ్ షాక్ కలిగించింది. దీనికి కారణం సినిమా నిర్మాణ సంస్థ గతంలో చేసిన కొన్ని తప్పులే. గత సినిమాల ప్రభావంతో ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న క్రమంలో.. రిలీజ్‌ను తాత్కాలికగా ఆపేసినట్లు మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని.. వీలైనంత వేగంగా సినిమా రిలీజ్ చేస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి క్రమంలో ప్రభాస్ అభిమానుల్లో కూడా సరికొత్త టెన్షన్ మొదలైంది. ప్రభాస్ రాజాసాబ్ మూవీ. డైరెక్టర్ మారుతి తెరకెక్కించనున్న ఈ సినిమా విషయంలో కూడా ఇలాంటి ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
ఈ సంస్థకు కూడా ఆర్థిక లావాదేవీల సమస్యలు చాలానే ఉన్నాయట. ఇక.. అవన్నీ సెట్ చేస్తే కానీ రాజాసాబ్ రిలీజ్‌కు ఆటంకాలు తప్పవంటూ.. ఇండస్ట్రీ టాక్. ఇదే వాస్తవం అయితే మాత్రం.. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్‌లా ప్రభాస్ ఫ్యాన్స్‌కు కూడా డిసప్పాయింట్మెంట్ తప్పదు. 2026 జనవరి 9లో రాజాసాబ్ సంక్రాంతి బరిలో రిలీజ్ కావాలి. మరి.. ఈ మూవీ రిలీజ్ విషయంలో చిన్న తేడా వచ్చినా రిలీజ్ డేట్ పై ఎఫెక్ట్ పడడం కాయం. అఖండ 2 లాస్ దృష్టిలో పెట్టుకొని.. ఇప్పటికైనా రాజాసాబ్ నిర్మాతలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని.. ఫ్యాన్స్‌కు ఇలాంటి డిసప్పాయింట్మెంట్ ఎదురు కాదంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మేకర్స్ ఎలాంటి డేసిషన్ తీసుకుంటారో చూడాలి.



