అఖండ 2 పై బాలీవుడ్ క్రిటిక్ షాకింగ్ రివ్యూ.. అసలు ఊహించలేదుగా..!

గాడ్‌ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత రూపొందిన ప్రాజెక్ట్ అఖండ 2. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు. డిసెంబర్ 5న‌ సినిమా రిలీజ్ అవుతుందని ఆరాటపడ్డారు. అయితే.. వాళ్లందరికీ మేకర్స్ బిగ్ డిసప్పాయింట్ మిగిల్చారు. సినిమా వాయిదా పడింది. మొదట ప్రీమియర్ టెక్నికల్ ఇష్యూ కారణంగా ఆగిపోయాయని అనౌన్స్ చేసిన 14 రీల్స్‌ ప్లస్ టీం.. కొద్దిసేపటికి సినిమా రిలీజ్‌ను పూర్తిగా ఆపేసామంటూ చెప్పుకొచ్చారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను క్లారిటీ ఇస్తామని తెలియజేశారు. అయితే.. సినిమా వాయిదా పడిందంటూ నిరాశ వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్ కు.. తాజాగా ఓ బాలీవుడ్ క్రిటిక్‌ ఇచ్చిన రివ్యూ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

Akhanda 2 Critic Review: అఖండ 2 క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్ | Akhanda 2  Movie Review by Umair Sandhu: Nandamuri Balakrishna mvoie is Paisa Vasool  Movie - Telugu Filmibeat

అఖండ 2 సినిమాపై బాలీవుడ్ స్టార్ క్రిటిక్ ఉమైర్ సంధు రియాక్ట్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా రివ్యూ ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నాడు. పైసా వసూల్ మూవీ అని.. పక్కా మాస్‌.. బాలయ్య అభిమానులకు ఫుల్ మీల్ అంటూ చెప్పుకొచ్చాడు. బాలయ్య డైలాగ్ డెలివరీ, బ్యాగ్రౌండ్, మ్యూజిక్, యాక్షన్ సీన్స్ స్క్రీన్లు దద్దరిల్లేలా ఉన్నాయంటూ కామెంట్స్ చేశాడు. బాలకృష్ణ చెప్పే ఒక్కో డైలాగ్ ప్రేక్షకులతో క్లాప్స్‌ కొట్టిస్తుందని.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని మాస్ ఆడియన్స్‌కు అఖండ 2 తాండవం పండగే అంటూ చెప్పుకొచ్చాడు.

Akhanda 2' Early Review: Netizens Call Nandamuri Balakrishna's Film  “Biggest Blockbuster Loading”

కాగా.. ఉమైర్ సంధు చాలా వరకు సినిమాలన్నింటికీ నెగటివ్ రివ్యూస్ ఇస్తూ ఉంటాడు. తాను బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమాకు పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం.. సినిమా హిట్ అవుతుంటూ ధీమా వ్యక్తం చేయడంతో ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నెల‌కొంది. అయితే ఉమైర్‌ చెప్పిన రివ్యూలు ప్రతిసారి నిజం కాలేదు. చాలా సందర్భాల్లో ఆయన ఫ్లాప్ అవుతాయి అన్న సినిమాలు ఇండస్ట్రియల్ హిట్లుగా నిలవడం.. సూపర్ హిట్ అన్న సినిమాలు డిజాస్టర్ గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది ఆడియన్స్ సినిమా రిజల్ట్ పై ఆందోళన మొదలైంది. ఇక డిసెంబర్ 5నై మూవీ రిలీజ్ అయితే ఒరిజినల్ రివ్యూ బయటకు వచ్చేస్తుందని.. సినిమా ఎలా ఉందో తెలిసిపోతుందని ఫ్యాన్స్ ఆరాటపడ్డారు. కానీ సినిమా రిలీజ్ వాయిదా వేసి 14 రిలీస్ ప్లస్ బ్యానర్ వాళ్ళు ఫ్యాన్స్ అసలు పై నీళ్లు చిమ్మారు.