అఖండ 2 రిలీజ్ వాయిదా.. వేణు స్వామిని టార్గెట్ చేసిన బాలయ్య ఫ్యాన్స్..!

బోయపాటి డైరెక్షన్‌లో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. ఇప్పటికే ఈ మూవీ థియేటర్‌లో రిలీజ్ కావ‌ల్సి ఉండ‌గా.. అనూహ్య‌ కారణాలతో సినిమా వాయిదా పడడం అటు టాలీవుడ్ వర్గాలతో పాటు.. బాలయ్య అభిమానులకు కూడా బిగ్ షాక్ కలిగించింది. కనీసం ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అసలు ఎందుకు వాయిదా పడిందో తెలియ‌ని గందర గోళం అభిమానుల్లో మొదలైంది. ఈ క్రమంలోనే బాలయ్య అభిమానులు చాలా మంది వేణు స్వామిని టార్గెట్ చేస్తూ తెగ ట్రోల్స్‌ చేస్తున్నారు. అసలు ఈ రిలీజ్ ఆగిపోవడానికి వేణు స్వామికి లింక్ ఏంటి.. తనను ఎందుకు టార్గెట్ చేశారో ఒకసారి తెలుసుకుందాం.

స్టార్ ఆస్ట్రాలజ‌ర్ వేణు స్వామికి పరిచయాలు అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో యూట్యూబ్లో పలు టీవీ ఛానల్ లో జాతకాలు, పంచాంగలు, రాశి ఫలాలు చెప్పుకుంటూ వచ్చిన వేణు స్వామి.. మెల్లమెల్లగా నాగచైతన్య – సమంత, అలీల‌నే మ‌రికొంద‌రు సెలబ్రిటీల విషయంలో చెప్పిన జోష్యం సక్సెస్ అవడంతో.. పాపులర్ అయిపోయాడు. అయితే వేణు స్వామికి.. గ‌త కొంతకాలంగా భారీ దెబ్బ తగిలిందని చెప్పాలి. ఆయన చెప్పిన జ్యోతిష్యమంతా ఎదురకొడుతుంది.. ఎన్నో ట్రోల్స్ ని ఎదుర్కొంటున్నాడు. ఇక గతేడాది నాగచైతన్య, శోభిత పెళ్లి తర్వాత వేణు స్వామి చేసిన కామెంట్స్.. భారీ దుమారమే రేపాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న నాగార్జున.. జర్నలిస్ట్ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయడంతో.. కమిషన్ ఆయనకు నోటీసులు పంపించారు. ఈ వివాదం దెబ్బతో ఎప్పటికీ రాజకీయ, వ్యక్తిగత జాతకాల జోలికి వెళ్ళనని వేణు స్వామి క్లారిటీ ఇచ్చేశాడు. దీనికి అనుకూలంగానే సమంత – రాజ్ పెళ్లి గురించి వేణు స్వామిని ఎంతో మంది అప్రోచ్ అయినా ఆయన రియాక్ట్ కాలేదు.

రెండు రోజుల క్రితం హోమం చేస్తూ వీడియోని షేర్ చేసుకున్నాడు. ఈ హోమంలో కీలక విషయాలను వెల్లడించాడు. సమంత – రాజ్ నిడ‌మోరు పెళ్లి వారి మ్యారీడ్ లైఫ్ పై తాను మాట్లాడన‌ని క్లారిటీ ఇచ్చాడు. అయితే.. మేము మూడు రోజుల నుంచి భగాలముఖి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నామని.. హోమం కూడా నిర్వహించామంటూ క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే రిలీజ్ కానున్న బడా ప్రాజెక్టు సక్సెస్ కావాలని ఈ భగాలముఖి అమ్మవారికి హోమం చేస్తున్నామంటూ వివ‌రించాడు. ఇక.. ఈ పెద్ద సినిమా మరేదో కాదు అఖండ 2 నే అని అంతా భావించారు. ఇప్పట్లో భారీ బడ్జెట్ తెలుగు మూవీ అంటే అఖండ 2నే వినిపిస్తుంది. ఈ క్రమంలోనే బాలయ్య కోసమే వేణు స్వామి పూజలు నిర్వహించారని అన్నారు.

కట్ చేస్తే అఖండ 2 హిట్ అవడం అటుంచితే.. రిలీజ్ కి దెబ్బ అయిపోయింది. మొదటి డిసెంబర్ 4 ప్రీమియర్ షోస్ అన్నారు అది ఆగిపోయాయి. ఇక ఓవర్సీస్ లో యధాతధంగా బొమ్మ పడుతుందని అంత అనుకున్నారు.. కానీ ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కూడా ఆగిపోయాయి. డిసెంబర్ 5న సినిమా అయినా రిలీజ్ అవుతుంది అని భావించారు. కానీ.. కొద్ది గంట‌ల‌ వ్యావ‌ధిలోనే సినిమాను కూడా రిలీజ్ చేయడం ఆపేశారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. దీంతో వేణు స్వామిని బాలకృష్ణ ఫ్యాన్స్ తెగ ఆడిపోసుకుంటున్నారు. బాలయ్య కెరీర్ లో ఇలాంటి ఘటన మునుపెన్నడూ జరగలేదని.. నీ పూజల వల్లే ఇదంతా అని.. అస్సలు ఆ పూజలు ఫలించడం అటు ఉంచితే.. వెనక్కు తంతున్నాయని మండిపడుతున్నారు. మరి దీనిపై వేణు స్వామి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.