ఆ ఏరియాలో అఖండ 2 కు భారీ బెనిఫిట్.. లాభాలు కన్ఫామ్..!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూపొందిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ అఖండ 2 తాండ‌వం. మరి కొద్ది గంటల్లో పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలోనే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ లెవల్‌లో జరిగింది. ఈ బూవీరి నైజాం ఏరియాలె 23.50 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌గా.. సీడెడ్ లో రూ.22 కోట్లు, ఉత్తరాంధ్ర 11.5 కోట్లు, ఈస్ట్ 7.50 కోట్లు, వెస్ట్ 5.50 కోట్లు, గుంటూరు 8.50 కోట్లు, కృష్ణలో 5.75 కోట్లు, నెల్లూరులో రూ.4 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇలా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. దాదాపు రూ.88.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న అఖండ 2.. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా డబ్బింగ్ వర్షన్లను కలుపుకొని.. రూ.11 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది. ఓవర్సీస్ లో రూ.15 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ క్రమంలోనే.. ప్రపంచవ్యాప్తంగా అఖండ‌కు రూ.114. 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీని ప్రకారం.. రూ.116 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ బరిలోకి సిద్ధమవుతుంది. ఇటీవల కాలంలో.. తెలుగు సినిమాలు హిందీ భాషలోను.. భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంటున్నాయి.

మన తెలుగు సినిమాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్లు కొల్ల‌గొడుతున్నాయి. ఈ క్రమంలోనే.. అఖండ 2పై కూడా.. పాన్ ఇండియా లెవెల్‌లో ఆడియన్స్‌లో మంచి హైప్‌ మొదలైంది. అయితే.. ఈ సినిమాకు కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా డబ్బింగ్ వర్షన్లకు కలుపుకొని కేవలం రూ.11 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో.. ఈ సినిమా కాస్త మంచి టాక్ దక్కించుకుంటే.. అక్కడ రూ.11 కోట్ల షేర్ కొల్లగొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ క్రమంలోనే.. లాభాల బాట పట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఇండియా వ్యాప్తంగా సినిమా రిజ‌ల్ట్‌తో భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. కర్ణాటక, రెస్ట్ఆఫ్ ఇండియా డబ్బింగ్ వర్షన్ హక్కులను కొనుగోలు చేసిన వారికి లాభాల వర్షం కాయమంటూ అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.