అఖండ 2: డే 1 కలెక్షన్స్ ఎంత.. ఆ రికార్డ్ పై బాలయ్య టార్గెట్..!

గాడ్ ఆఫ్‌ మాసేస్ బాలకృష్ణ, డైరెక్టర్ బోయ‌పాటి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. రామ్ అచంట, గోపి ఆచంట నిర్మాతలుగా.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించారు. బాలయ్య చిన్న కూతురు తేజస్విని నందమూరి సమర్పకురాలుగా వ్యవహరించింది. ఇక.. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా.. భారీ సక్సెస్ అందుకోవడంతో.. ఆఖండ 2 తాండవం పై అంచనాలు డబల్ అయ్యాయి. సినిమా ప్రమోషనల్ కంటెంట్ తోను మంచి రెస్పాన్స్ దక్కించుకున్నారు టీం. ఇక.. ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఒకరోజు ముందు డిసెంబర్ 4 రాత్రి నుంచే సినిమా ప్రీమియర్లు ప్రదర్శించేందుకు భారీగా ఏర్పాట్లు చేసారు టీం.

ఇప్పటికే.. చాలా చోట్ల బుకింగ్స్ కూడా ఓపెనై రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఆల్ ఇండియా తెలుగు వర్షన్ కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే 50 శాతం ఆక్యుపెన్సి నమోదయిపోయింది. దాదాపు 57,000 టికెట్లు అమ్ముడుపోయట. దీంతో.. రూ.4 కోట్ల వరకు వసూలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఫస్ట్ అడ్వాన్స్ కలెక్షన్స్ విషయానికి వస్తే 17,500 టికెట్లు అమ్ముడుపోగా.. 30% ఆక్యువన్సితో అఖండ దూసుకుపోతుంది. అలా.. కేవలం ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఇప్పటికి రూ.4 కోట్లకు పైగా వసూలు దక్కాయని.. ప్రీమియర్స్‌, ఫస్ట్ డే బుకింగ్స్ కలెక్షన్లు కలుపుకొని.. రూ.8 కోట్లకు పైగానే వ‌సూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఇక.. ఓవర్సీస్ స్పెషల్ షో విష‌యానికి వస్తే.. అమెరికాలో 428 లోకేషన్ లో..1073 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారు టీం. వీటి ద్వారా సుమారు 2,5516$ వచ్చేసాయి. 10100 టికెట్లు అమ్ముడు అయినట్లు సమాచారం. నార్త్ అమెరికాలో 280k డాలర్ల మేర వసూళ్లు అంటే దాదాపు రూ.25 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక సినిమా రిలీజ్‌కు మని కొద్ది గంటలు మాత్రమే సమయం ఉన్న క్రమంలో.. ఈ కలెక్షన్ల‌ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో సినిమాకు రూ.10 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో నమోదైన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక బాలయ్య కెరీర్‌లో ఇప్పటివరకు కేవలం వీర సింహారెడ్డి మాత్రమే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.54 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. అఖండ అంతకుమించే రేంజ్‌లో క‌లెక్ష‌న్‌లు కొల్ల‌గొటేలా బాల‌య్య టార్గెట్ చేశాడ‌ట‌.