సింహా, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సిక్వల్ గా ఈ సినిమా రూపొందిన క్రమంలో.. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సైతం ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమాను.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై.. రామ్ అచంట, గోపి అచంట సంయుక్తంగా నిర్మించారు. ఇక.. రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాను.. మరికొద్ది గంటల్లో (రాత్రి 9:30కు) ప్రీవియర్ షోస్ ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓపెనై.. సాలిడ్ సెల్లింగ్స్తో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ముంబై, ఢిల్లీ.. ఇతర రాష్ట్రాల్లో బుకింగ్ ప్రారంభించిన అఖండ 2 టీం.. ఈ బుకింగ్స్ ద్వారా రికార్డులు క్రియేట్ చేశారు. ఇప్పటికే.. ఏపీ ప్రీమియర్ షోస్ టికెట్లు మొత్తం అమ్ముడైపోయాయి. ఎక్స్ట్రా షోస్ కూడా యాడ్ చేస్తున్నట్లు టీం అఫీషియల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. అయితే.. నైజం ప్రాంతంలో మాత్రం ఫ్యాన్స్ కు ఈ విషయంలో బిగ్ డిసప్పాయింట్మెంట్ ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించిన నైజాం బుకింగ్స్ విషయంలో మాత్రం తర్జనభజనలు జరుగుతున్నాయి. వాస్తవానికి నిన్న సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ప్రీమియర్ బుకింగ్స్ ఓపెన్ కావలసి ఉండగా.. ఇప్పటికీ బుకింగ్స్ ఓపెన్ చేయలేదు.
దీనికి కారణం.. తెలంగాణ వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన.. ఇప్పటివరకు తెలంగాణ గవర్నమెంట్ జీవోను పాస్ చేయకపోవడమేనట. అందుకే సినిమా బుకింగ్స్ హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తుంది. ఇటీవల.. ఓజీ సినిమాకు కూడా ఇలాగే పర్మిషన్స్ ఇచ్చారు. కానీ.. తర్వాత కొందరు కోర్ట్‌లో కేసులు వేయడం.. నిర్మాతలకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో.. ఈ స్పెషల్ జీవో విషయంలో గందరగోళం నెలకొంది. ఇప్పుడు రాబోతున్న అఖండ 2 కూడా ఇదే కన్ఫ్యూషన్ లేకుండా.. జీవో విషయంలో అడుగులు వేస్తున్నారట. కానీ.. ప్రీమియర్స్‌కు మరికొన్ని గంటలు మాత్రమే టైం ఉన్న క్రమంలో.. ఇంకా బుకింగ్ ఓపెన్ చేయకపోవడంపై.. ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ పై ఫైర్ అవుతున్నారు. ఈ ప్రభావం అఖండ 2 ఫస్ట్ డే కలెక్షన్ల పూ పడనుందట.



