సినిమా ఏదైనా సరే.. రిజల్ట్ ఎలా ఉన్నా.. నిర్మాతలకు సేఫ్ సైడ్ గా మారిన అంశం ఓటీటీ డీల్స్ అనడంలో అతిశయోక్తి లేదు. అయితే.. ఈ నెలలో ఓటీటీలు కూడా నిర్వాతులకు షాక్ ఇచ్చాయి. సినిమా హిట్, ఫ్లాప్ ఆధారంగానే సినిమాలను కొనుగోలు చేయడం ప్రారంభించాయి. గతంలో అయితే.. సినిమా సక్సెస్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఓటీటీ డీల్స్ పూర్తయిపోయేవి. అగ్రిమెంట్ ప్రకారమే అమౌంట్ ఇచ్చే.. సినిమాను తీసుకునే వాళ్ళు. కానీ.. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఆ రూల్ బ్రేక్ చేశాయి. థియేటర్‌లలో సినిమా సక్సెస్ అయితేనే అగ్రిమెంట్ అమౌంట్ పై 25% ఆదనంగా డబ్బు చెల్లించనున్నాయి.

ఒకవేళ సినిమా సక్సెస్ కాకపోతే.. అగ్రిమేంట్ అమౌంట్ 25% తగ్గించి.. మేకర్స్‌కు ఇవ్వనున్నారట. అయితే.. ఓటీటీలో ఈ కొత్త రూల్ ఫాలో కానున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా అఖండ 2 తాండవం మొదటి స్థానంలో నిలవనుంది. కాగా.. ఓటీటీ ప్రకారం చిన్న సినిమాలు అయితే రెండు నుంచి మూడు వారాలకు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు.. స్టార్ హీరోల సినిమాలు అయితే గరిష్టంగా నాలుగు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. దీంతో థియేటర్లో సినిమాలు చూసేందుకు ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కారణం.. థియేటర్లో కొత్త సినిమాలలో ఎంజాయ్ చేయొచ్చంటే.. కేవలం సినిమా టికెట్ల రేట్లే కాదు, థియేటర్లో అమ్మే వాటర్ బాటిల్, పాప్ కార్న్, ఇతర స్నాక్స్ రేట్లు ఆకాశాన్నికంట్టడం.

నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ సినిమా చూడాలంటే 2000 ఖర్చు అయిపోతాయి. అదే.. ఓటీటీలో అయితే ఫ్యామిలీ మొత్తం ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. ఈ క్రమంలోనే వాటికి మంచి ఆదరణ దక్కుతుంది. సినిమా విషయానికొస్తే.. బోయపాటి, బాలయ్య హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న బడా ప్రాజెక్ట్. అది కూడా.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా రూపొందనుంది. ఈ క్రమంలోనే.. సినిమా పై తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఆడియన్స్‌లో భారీ హైప్ సొంతమైంది. థియేటర్‌లో అఖండగా.. బాలయ్య రుద్రతాండవం కన్ఫామ్ అంటూ బాక్స్ ఆఫీస్ బద్దలై పోతుందంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

