స్టార్ బ్యూటీ సమంత పర్సనల్ లైఫ్ తెరిచిన పుస్తకమే. మ్యారేజ్ లైఫ్, డివోర్స్, తర్వాత హెల్త్ ఇషూస్.. ఇలా చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన సమంత.. దాదాపు రెండేళ్ల తర్వాత కం బ్యాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే కెరీర్‌పై ఫుల్ ఫోకస్ చేస్తూ.. సినిమాలతో బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ.. అమ్మడు మాత్రం బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ రాజ్ నిడమోరుతో ప్రేమాయణం వార్తలకు తెరలేపింది. వీళ్లిద్దరూ లవ్‌లో ఉన్నారని.. డేటింగ్ చేస్తున్నారంటూ.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల ముంబై వీధుల్లో ఈ జంట తెగ సందడి చేస్తూ.. క్లోజ్ గా కెమెరాల కంటపడ్డారు. ఈ క్రమంలోనే త్వరలోనే రెండో పెళ్లి చేసేసుకోబోతున్నారని.. ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ అయిందని.. డిసెంబర్ 1న వీళ్లిద్దరు వివాహం జరగబోతుంది అంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. వాటికి ఆజ్యం పోసేలా సమంత తన చేతికి ఓ డైమెండ్ రింగ్‌తో ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అమ్మడు చేతికి ఉన్న రింగ్ హైలెట్‌గా మారింది. దీంతో వీళ్ళిద్దరూ సీక్రెట్ ఎంగేజ్మెంట్ అయిపోయిందని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
అది కూడా తనకు ఎంతో ఫేవరెట్ ప్లేస్ అయినా కోయంబత్తూర్ లోని ఈషా యోగ సెంటర్లో పెళ్లి బంధంతో ఒకటవనున్నారంటూ వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై సమంత కాని.. రాసినడుమూరు కానీ అఫీషియల్ గా ప్రకటించకపోవడంతో అంతా దీన్ని లైట్ తీసుకున్నారు. అయితే.. సినీవర్గాల తాజా సమాచారం ప్రకారం.. సమంత డైరెక్టర్ రాజ్‌ను కొత్తిసేపటిక్రితం పెళ్లి చేసుకుందట. ఈ రోజు ఉదయం కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో వీళ్ళ పెళ్లి జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు స్టార్ కపుల్స్ వీళ్ళిద్దరికీ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. ఇక పెళ్లికి సంబంధించి.. ఈ జోడి త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సినీ వర్గాలు వెల్లడించాయి.



