మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన్న కాంబినేషన్‌లో విలేజి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌గా పెద్తి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా మెరవనుంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు త్రిపాఠీ, సత్య తదితరులు కీలక పాత్రల్లో మెరవనున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ పనిచేస్తుండడం మరో హైలెట్. ఇప్పటికే.. సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, గ్లింప్స్, సాంగ్స్ భారీ క్రేజ్ దక్కించుకున్నాయి. ముఖ్యంగా చిక్కిరి సాంగ్ అయితే.. యూట్యూబ్‌లో ప్రకంపనలు సృష్టించింది. వందల మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.

ఇక.. ఈ సినిమాలో జాన్వి.. అచ్చీఅమ్మ అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించిందని సమాచారం. అయితే.. చిక్కిరిలో జాన్వి నేచురల్ లుక్‌ను చూసి అంతా ఫిదా అయ్యారు. కాగా.. జాన్వీ సినిమాలో కొన్ని చోట్ల డూప్ ను వాడిందట. ఈ అమ్మడికి డుప్‌గా ఓ తెలుగు హీరోయిన్ నటిస్తుందని.. ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వైరల్ గా మారుతుంది. ఆమె మరెవరో కాదు.. మసుదాలో దెయ్యం పాత్రలో భయపెట్టిన బాంధవీ శ్రీధర్. ఎస్.. జాన్వీ కపూర్ హైట్ 5అడుగుల 4 అంగుళాలు. బాంధవి శ్రీధర్ హైట్ కూడా దాదాపు ఇంతే ఉంటుంది. వీళ్ళిద్దరి లుక్స్ కూడా చూడడానికి చాలా వరకు సేమ్. ఈ క్రమంలోనే పెద్ది సినిమాలో కొన్ని సీన్లకు జాన్వి డూప్‌గా బాంధవీ నటించిందని తెలుస్తుంది.
అంతేకాదు.. సినిమాలో ఓ కీలక పాత్రల్లోను అమ్మడు మెరవనుందని సమాచారం. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఇదే న్యూస్.. నెటింట వైరల్‌గా మారుతుంది. అంతేకాదు.. తాజాగా అమ్మడు ఈ సినిమాలోని చిక్కిరి చిక్కిరి సాంగ్‌లో చాలా హుషారుగా స్టెప్స్ వేసి.. ఆడియన్స్‌ను కట్టిపడేసింది. సాంగ్ కంపోజ్ చేసిన జానీ మాస్టర్ తో కలిసి డ్యాన్స్ వేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. ఇక.. వచ్చే ఏడాది మార్చి 27న చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా రిలీజ్‌కానున్న ఈ సినిమా.. ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
View this post on Instagram

