” స్పిరిట్ ” యూనివర్స్ కోరిలు ఓకే.. మరీ ఆ లాజిక్ మిస్సయ్యారుగా..

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో రూపొందుతున్న స్పిరిట్ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు ఇప్పటికే భారీ లెవెల్ లో నెలకొన్నాయి. రీసెంట్‌గా సినిమా ఫ‌స్ట్‌ షార్ట్ కూడా కంప్లీట్ చేశారు. అప్పుడే స్పిరిట్ యూనివర్స్ అంటూ సోషల్ మీడియాలో రకరకాల కథలు వైరల్ అయిపోతున్నాయి. ఇక సినిమా కంప్లీటై.. రిలీజ్ కావడానికి మరో రెండు సమయం పడుతుంది. అయితే.. ఇప్పుడే సినిమాపై క్రాస్ ఓవర్ ముచ్చట్లు మొదలైపోయాయి. ఇంకా షూటింగ్ కూడా మొదలు కాక‌ముందే.. ఈ వార్తలేంటో అర్థం కాని పరిస్థితి. అసలు మ్యాటర్ ఏంటంటే.. గతంలో ఎప్పుడో అన్‌స్టాపబుల్ షోలో యానిమల్ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన రణబీర్ కపూర్.. సరదాగా నన్ను కూడా.. స్పీరిట్‌ మూవీలో పెట్టండి.. ఏదో ఒక పాత్ర ఇప్పించండి అంటూ ఫన్నీగా అడిగిన మాటలను.. పట్టుకొని బాలీవుడ్ మీడియా ఇప్పుడు రణ్‌బీర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో చేయబోతున్నాడు అంటూ సీరియస్ ఆర్టికల్స్ రాసేస్తున్నారు.

Unstoppable with NBK: Ranbir Kapoor, Rashmika Mandanna dance with Balayya  in new promo - India Today

కానీ అది కేవలం షోలో జరిగిన ఓ సరదా సంభాషనే కానీ.. ఎక్కడ ప్లానింగ్ లేదు. ఇక మొదట ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రి రోల్ లో నటిస్తున్నాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. సంజయ్ ద‌త్ విల‌న్ అంటూ టాక్ నడిచింది. అవన్నీ కేవలం పుకార్లేన‌ని వంగా క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పుడు.. మళ్లీ ఇదే యూనివర్స్ లో రణబీర్ కపూర్ నటించబోతున్నాడని లేనిపోని రొమాన్స్ క్రియేట్ చేసి.. అన‌వ‌స‌ర హైప్‌ తెస్తున్నారు కొంతమంది ఆకతాయిలు. వీటి కారణంగా.. ఆడియన్స్ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్‌తో థియేటర్‌కి వెళ్లే అవకాశం ఉంది. లేనిది ఉన్నట్లు ఊహించుకొని.. థియేటర్లలో అడుగుపెడితే వాళ్లకు కూడా అసలు కంటెంట్ నచ్చకపోవచ్చు.

ఇక.. టెక్నికల్ గా కూడా వంగ యూనివర్స్‌లో ఇది పెద్దగా వర్కౌట్ కాదని టాక్ నడుస్తుంది. కారణం.. యానిమల్‌లో జోయాగా బోల్డ్ పాత్రలో నటించిన తృప్తి డిమ్రి.. ఇప్పుడు స్పిరిట్‌లో మెయిన్ హీరోయిన్‌గా ఉంది. ఒకవేళ.. ఈ రెండు సినిమాలు ఒకే యూనివర్స్‌లో ఉంటే మాత్రం ఒకే హీరోయిన్.. రెండు వేరువేరు పాత్రల్లో ఎలా కనిపిస్తుంది.. ఈ లాజిక్ మిస్ అయ్యితే ఎలా.. ఇది చాలు స్పిరిట్ సినిమాకు భారీ దెబ్బ అయిపోతుంది అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్పిరిట్ అనేది యానిమల్ పార్క్‌ లింక్ లేని ఒక సెపరేట్ కంటెంట్ అని చెప్పడానికి ఈ ఇది సరిపోతుంది. ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ గా కాకి డ్రెస్‌లో వస్తే అభిమానుల్లో వచ్చే కిక్కే వేరు. మరే హంగులు అవసరం లేదు. యానిమల్ పార్క్.. స్పిరిట్ యూనివర్సిటీ అస‌లు సంబంధం లేకుండా వస్తుందని ఫిక్స్ అవడం మంచిది.