స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ప్రస్తుతం నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. సమంత చీటర్ అంటూ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ దుమారంగా మారుతున్నాయి. అంతేకాదు.. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సైతం ట్రెండ్ అవుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. సిద్దు జొన్నలగడ్డ, రాశి కన్నా.. శ్రీనిధి శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ తెలుసు కదా.. అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాతో నీరజ కోన దర్శకురాలుగా ఇండస్ట్రీకి పరిచయమైంది. అప్పటివరకు హెయిర్ స్టైల్స్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ అమ్మడు.. మొట్టమొదటి సినిమాతో దర్శకురాలిగా మారి హిట్ కొట్టింది. అమ్మడికి మంచి ఇమేజ్ కూడా వచ్చింది.
కానీ.. సినిమా రిలీజ్ అయిన ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత.. ఈ సినిమాకు సంబంధించిన మ్యాటర్ ను రివిల్ చేశాడు ఓ అసిస్టెంట్ డైరెక్టర్. ఈ సినిమా స్టోరీ నీరజకోనది కాదని.. ఆ స్టోరీ నాదని.. నా స్టోరీని హీరోయిన్ సమంతనే బయటకు లీక్ చేసిందంటూ సదరు అసిస్టెంట్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. సమంతకు సంబంధించిన కొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్లను సైతం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో.. ఈ వాట్సాప్ స్క్రీన్ షాట్స్ నెటింట పెద్ద దుమారంగా మారాయి. అయితే.. అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. తెలుసు కదా సినిమాని నేను ఫిమేల్ సెంట్రిక్ మూవీ గా తీయాలి అనుకున్నా. సమంత లేదా రష్మిక తో ఈ సినిమా తీయాలని భావించా. ఆ తర్వాత ప్రొడ్యూసర్‌లకి.. నితిన్, నాని, సమంత లకి ఈ సినిమా స్టోరీ ని వినిపించా.
కాగా.. సమంత స్టోరీ నీరజ కోనా దగ్గర లీక్ చేసిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఎన్నో రోజులుగా నీరజ.. సమంత దగ్గర మేకప్ అలాగే హెయిర్ స్టైలిస్ట్ గా పని చేస్తుంది.. అలా ఆమె నా స్టోరీ మొత్తం చెప్పేసిందని చెప్పుకొచ్చాడు. నేను చెప్పిన కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి.. ఫిమేల్ సెంటర్ కి మూవీ కాస్త మెయిల్ సెంట్రిక్ మూవీ గా మార్చేసి.. ఈస్ట్రోజన్, ప్రాజెస్ట్రాన్ అని స్టోరీని బలహీన పరిచిందంటూ అసిస్టెంట్ డైరెక్టర్ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం నెటింట ఈ పోస్ట్ తెగ వైరల్ గా మారడంతో.. చాలామంది నెటిజన్లు సమంత పై ఫైర్ అవుతున్నారు. నిజంగా.. ఈమె ఇంత చీటరా.. ఓ డైరెక్టర్ రాసుకుని ఎన్నో కలలు కన్నా కథను మరొకరికి ఎలా చెబుతుంది.. అంత పెద్ద మిస్టేక్ ఎలా చేసింది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఆరోపణల పై సమంత ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి.


