మరో బడా ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టిన అనిల్.. ఆ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ తో ఫిక్స్..

టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌ల‌లో.. రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి పేరే వినిపిస్తుంది. అంత‌లా ఇప్పటివరకు త‌ను తెర‌కెక్కించిన 8 సినిమాలతోనే మంచి సక్సెస్లు అందుకున్నాడు. వాటిలో కొన్ని సూపర్ హిట్ కాగా.. కొన్ని ఇండస్ట్రియల్ హిట్‌లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే.. ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీసే ఛాన్స్ కొట్టేసాడు. మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మరో సూపర్ హిట్ టార్గట్‌గా పెట్టుకున్న అనిల్.. ఆడియన్స్‌లో అంచనాలను మించిపోయేలా సినిమా రూపొందిస్తున్నాడట. ఈ క్రమంలోనే.. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్‌ మొదలైంది. ఇక.. అనిల్ ఈ సినిమా తర్వాత మరో బడా ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టుకున్నాడని సమాచారం.

సౌత్‌లోనే టాప్ స్టార్ చిరు, విజయ్ ప్రాజెక్టులను చేస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీ అటెన్షన్‌ను గ్రాఫ్ చేస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్స్.. తమ బ్యానర్ లోనే అనిల్ రావిపూడి తో మరో సినిమాను ఫిక్స్ చేసామంటూ అఫీషియల్ గా వెల్లడించారు. అనిల్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా కేవీయన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియా వేదిక విషెస్ తెలియజేస్తూ.. డైరెక్టర్ తో మరో భారీ ప్రాజెక్టు రాబోతుందంటూ హింట్ ఇచ్చారు. దీంతో ఈ బ్యానర్ లో అనిల్ సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. కాగా.. ఈ ప్రాజెక్టులో హీరో, హీరోయిన్లు ఎవరు.. ఇతర కాస్టింగ్ విషయాలు తెలియాల్సి ఉంది.

Anil Ravipudi Locks Massive New Film with KVN Productions | Anil Ravipudi  Locks Massive New Film with KVN Productions

త్వరలోనే వీటిపై కూడా అఫీషియల్ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇదే కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్లో మెగాస్టార్ చిరు – బాబి కొల్లి కాంబోలో ఇంకో భారీ ప్రాజెక్ట్ ఇప్పటికే లైన్లో ఉంది. ఇప్పుడు ఇదే బ్యానర్ పై అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ కూడా యాడ్ అవడంతో.. సౌత్ సినీ ఇండస్ట్రీలో సినిమాలపై మరింత ఫోకస్ చేస్తున్నట్లు అర్థమవుతుంది.