పవన్ “ఉస్తాద్ భగత్ సింగ్ “.. ” తెరి ” రీమేక్.. నిర్మాత క్లారిటీ..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతూనే.. మరో పక్క సమయం దొరికినప్పుడలా స్పీడ్‌స్పీడ్‌గా సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఎంతో కాలం నుంచి వాయిదా పడుతూ వచ్చిన హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలను కంప్లీట్ చేసి ఆడియన్స్‌ను పలకరించాడు పవన్. కాగా.. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎప్పటి నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ పవన్ పార్ట్‌ షూటింగ్‌ను కంప్లీట్ చేసేసారు మేకర్స్. ఇక మిగతా సినిమా షూట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని సినిమాను మరో వారంలో కంప్లీట్ చేసి ఏప్రిల్‌లో గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

Sreeleela's first look from Ustad Bhagat Singh out. See poster - India Today

అయితే.. సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఇది తమిళ్.. విజ‌య్‌ బ్లాక్ బస్టర్ మూవీ తేరి రీమేక్ అనే టాక్ వైరల్‌గా మారుతుంది. అయితే.. దీనిపై హరీష్ శంకర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా.. మేకర్స్‌ మాత్రం ఇది రీమేక్ ఫిలిం కాదని పూర్తిగా కొత్త కథ అంటూ చెప్పుకొచ్చారు. తాజా సమాచారం ప్రకారం తేరీ మూవీ నుంచి కోర్ పాయింట్ మాత్రమే తీసుకొని మిగతా స్టోరీ సీన్స్, రోల్స్ అన్నింటినీ పవన్ స్టైల్‌లో తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చినట్లు సమాచారం.

Pawan Kalyan's Ustaad Bhagat Singh Release, Poster & Cast Update | Mythri  Movie Makers

హరీష్ రీమిక్‌ను తన ఓన్ స్టైల్‌లో సరికొత్తగా రూపొందించడంలో దిట్ట కావడంతో.. అభిమానుల్లో సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తి మొదలైంది. ఇక ఇదే మేటర్ పై మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాతర శంకర్ రియాక్ట్ అయ్యారు. కథలో అంత బలమైన కంటెంట్ ఉంది. స్క్రిప్ట్ పవర్ స్టార్ ఇమేజ్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యేలా ఉంది. రీమేక్ అనిపించే సమస్య లేదు ఫుల్ మాస్ ఫుల్ పవర్‌తో ఆడియన్స్‌ను పలకరిస్తుందంటూ క్లారిటీ ఇచ్చేసాడు. రవిశంకర్ కామెంట్స్ తో ఉస్తాద్ భగత్ సింగ్‌పై హైప్‌ డబల్ అయింది. పవన్, హరీష్ కాంబోలో గతంలో గబ్బర్ సింగ్ వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా లేదా చూడాలి.