టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలుగా అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. కొంతమంది టాలీవుడ్ లో తమ సత్తా చాటుకుంటున్నారు.. మరి కొంతమంది పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నారు. చిరంజీవితో మొదలైన ఈ మెగా వృక్షం.. పవన్, అల్లు అర్జున్, చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్, శిరీష్ ఇలా చాలా భారీ లిస్ట్ అయిపోయింది. ఇక ఇదే ఇంటి నుంచి నిర్మాతలుగా మెగా డాటర్స్ నిహారిక కొణిదెల, సుస్మిత కొణిదెల ఇప్పటికే పళ్ళు సినిమాలకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి క్రమంలో మెగా కాంపౌండ్ నుంచి ఓ దర్శకుడు కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్ అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇంతకీ మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇస్తున్న ఆ కొత్త డైరెక్టర్ మరెవరో కాదు నిహారిక కొణిదెల అని సమాచారం. నిహారికకు టాలీవుడ్ ఆడియన్స్ లో ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. తన కెరీర్‌లో యాంకర్ గా, తర్వాత వెబ్ సిరీస్తో నటిగా, తర్వాత టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్గా, ఇప్పుడు నిర్మాతగా మల్టిపుల్ రోల్స్ ను ప్లే చేస్తున్నా ఈ అమ్మడికి.. కంటెంట్ సెలక్షన్ లో మంచి గ్రిప్ ఉంది. ఈ క్రమంలోనే.. అందరికీ షాక్ ఇస్తూ డైరెక్షన్ వైపు అడుగులు వేస్తుందట నిహారిక. సనిహిత వర్గాల టాక్ ప్రకారం.. నిహారిక ఇప్పటికే ఒక బలమైన కథను కూడా సిద్ధం చేసేసిందట. అదే కథతో సినిమా తీసేందుకు అన్ని సెట్ చేసే పనిలో బిజీగా ఉందట. ఇక ఈ సినిమా కోసం స్టార్ హీరోలు కాకుండా.. టాలెంట్ ఉన్న కొత్త నటులను తీసుకోవాలని భావిస్తుందట ఈ అమ్మడు.

అంతేకాదు.. తను సెలెక్ట్ చేసుకున్న స్టోరీ కూడా చాలా రియలిస్టిక్‌గా.. ప్రస్తుతం జరుగుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందనుందని టాక్ వైరల్ గా మారుతుంది. ఇక.. కథలో మరింత హైలెట్ ఏంటంటే.. ఈమె రియల్ లైఫ్ లో చూసిన కొన్ని ఇంట్రెస్టింగ్ సంఘటనల ఆధారంగా ఈ కథను రాసిందని.. కథలో ఎమోషన్స్, పాత్రలు చాలా నేచురల్ గా ఉండబోతున్నాయని టాక్ వైరల్ గా మారుతుంది. ఇక.. ఈ అమ్మడు నిజంగానే డైరెక్షన్ రంగంలోకి అడుగుపెడితే మాత్రం.. సినిమాపై అనౌన్స్మెంట్ అప్పటి నుంచే హైప్ మొదలవుతుంది అనడంలో సందేహం లేదు.

