టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైప్ మొదలైంది. ఇక.. ఈ సినిమాలో మొదటిసారి ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ప్రభాస్ ను సందీప్ ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక.. ఈ సినిమాలో విలన్ పాత్రలో కొరియన్ యాక్టర్ డాన్లీ నటించనున్నాడు. వీళ్ళిద్దరి మధ్య పోరు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. కాగా.. తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు గ్రాండ్ లెవెల్లో నిర్వహించారు. ఇందులో భాగంగా సందీప్ రెడ్డివంగా మాట్లాడుతూ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సినిమా షూటింగ్ కూడా మొదలుకాకముందే టార్గెట్ ను ఫిక్స్ చేసేసాడు సందీప్. రిలీజ్ అయిన తర్వాత కచ్చితంగా మూవీ రూ.2500 కోట్ల వసూళ్లను కొల్లగొడుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ కామెంట్స్‌తో సినిమాపై ఆడియన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. సందీప్ అనౌన్స్మెంట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు దేశంలోని హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా బాహుబలి నిలిచింది. దాని తర్వాత పుష్ప 2. ఇక అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా రూ.2000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన్నా.. ఇండియాలో మాత్రం కేవలం రూ.800 కోట్ల కలెక్షన్ మాత్రమే రాబట్టింది.

చైనాలో ఏకంగా రూ.1200 కోట్ల గ్రాస్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే సందీప్ ఏకంగా రూ.2500 కోట్ల కలెక్షన్లు వస్తాయంటూ అనౌన్స్ చేయడంతో.. కంటెంట్ పై ఆయనకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. కచ్చితంగా ఏదో పెద్దగానే ప్లాన్ చేసి ఉంటాడని.. అందుకే.. ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడు అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు బాహుబలి, దంగల్ సినిమాలు ఇండియన్ హైయెస్ట్ కలెక్షన్లు కల్లగొట్టిన సినిమాలు గా నిలిచాయి. ఇప్పుడు స్పిరిట్ అత్యధిక కలెక్షన్లు కలగొట్టిన సినిమాగా మారబోతుందని సందీప్ చేసిన కామెంట్స్ ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.


