హాలీవుడ్ సింగర్.. నిక్ జోనస్‌ని వివాహం చేసుకున్న ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు చెక్కేసి.. అక్కడే సెటిలైపోమింది. ప్రస్తుతం కోట్లల్లో రేమ్యునరేషన్ తీసుకుంటూ ఫుల్ డిమాండ్‌తో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఇక.. ప్రియాంక చోప్రా ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి, హీరో మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్టు వారణాసి సినిమాలో నటిస్తుంది. అయితే.. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఇందులో భాగంగానే.. అమ్మడి రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో ఉందట.
ఇక.. ప్రియాంక చోప్రా ఈ సినిమాకు ఒప్పుకున్నప్పటి నుంచి మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఏది రివిల్ చేయకపోయినా.. షూట్ కు వెళ్లిన ప్రతిసారి అక్కడ లొకేషన్స్‌లో ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తుంది. ఇటీవల వారణాసి మూవీ ఈవెంట్ లో కూడా ప్రియాంక సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్ట్‌లో బిజీ అయినప్పటి నుంచి ప్రియాంక.. మహేష్ బాబు ఫ్యామిలీ, డైరెక్టర్ రాజమౌళి ఫ్యామిలీలకు కూడా దగ్గరయ్యానని.. వాళ్లతో మంచి అనుబంధం ఏర్పడినట్లు ఇటీవల వెల్లడించింది. తాజాగా రాజమౌళి తనయుడు కార్తికేయకు బర్త్‌డే విషెస్ తెలియజేసిన ప్రియాంక.. తన ఇన్‌స్టా స్టోరీలో స్పెషల్ పోస్టులను పంచుకుంది.
కార్తికేయతో దిగిన ఫొటోస్ షేర్ చేస్తూ.. బర్త్‌డే విషెస్ తెలియజేసింది. అంతేకాదు.. అతనితో కలిసి చేసిన డ్యాన్స్ వీడియోను సైతం అమ్మడు పంచుకుంది. ఇక.. ఈ వీడియోకు టేక్ ఇట్ ఈజీ మై ఫ్రెండ్.. సైలెంట్‌గా అన్ని పనులు చేసే వ్యక్తి.. హ్యాపీ బర్త్‌డే కార్తికేయ అంటూ క్యాప్షన్ జోడించింది. ఈ సినిమా షూట్ టైంలో.. నీతో డ్యాన్స్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందంటూ పంచుకుంది. ప్రస్తుతం ఆ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇక.. రాజమౌళి తనయుడు కార్తికేయ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూనే.. ప్రమోషన్స్ ను కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇక వీళ్లిద్దరి డ్యాన్స్ వీడియోను మీరు ఓ లుక్కేసేయండి.
It looks like the cast and crew of #Varanasi have a truly organic connection, unlike the artificial “brotherhood” that was staged for the last movie 🙌#MaheshBabu #PriyankaChopra #SSKpic.twitter.com/Dk23OkmCOI
— TFI Movie Buzz (@TFIMovieBuzz) November 22, 2025

