ఈ జనరేషన్ హీరోయిన్లకు అసలు అవకాశాలు రావడమే చాలా కష్టం. అలాంటి ఒకే ఏడాదిలో ఏకంగా 7 సినిమాల్లో నటించి రికార్డులు క్రియేట్ చేసింది.. ఈ పై ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ ముద్దుగుమ్మ. ఇంతకీ ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఆమె కెరీర్ ప్రారంభంలో ఊహించిన రేంజ్లో అవకాశాలు అందుకోకపోయినా.. ప్రస్తుతం మాత్రం సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ బిజీబిజీగా గడుపుతుంది. ఇండస్ట్రీలోనే సెన్సేషనల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది. ఇలాంటి క్రమంలోనే.. ఈ ఏడాదిలో ఏడు సినిమాలను రిలీజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. తన ప్రతి సినిమాను బిగ్ బ్యానర్, స్టార్ హీరోలతో, టాప్ డైరెక్టర్లతోనే చేస్తుంది.
కేవలం అందం, నటన కాదు వైవిధ్యమైన పాత్రలతోనూ తన సత్తా చాటుకుంటుంది. అతి తక్కువ సమయంలో ఏడు ప్రాజెక్టుల షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తూ రావడం అంటే అది అంత సులువైన మ్యాటర్ కాదు. అయితే ఈ క్రేజ్ వెనుక ఈమె నటన టాలెంటే కరణం అనడంలో అతిశయోక్తిలేదు. ఇక.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. మల్టీస్టారర్, విలన్ రోల్స్, ఎమోషనల్ డ్రామాస్ లోను ఆకట్టుకుంటుంది. ఇంతకీ.. ఈమె ఎవరో ఇప్పటికైనా గెస్ చేశారా. సర్లెండి మేమే చెప్పేస్తాం. ఆమె అనుపమ పరమేశ్వరన్. ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభంలో నెగిటివ్ పాత్రలో ఆడియన్స్ను ఆకట్టుకుని.. తర్వాత హీరోయిన్గా మరి నటనతో ప్రేక్షకులను మెప్పించింది.
ఇక ప్రస్తుతం ఉన్న టఫ్ కాంపిటీషన్లో.. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయడమే కష్టం. అలాంటిది అనుపమ.. అసాధారణమైన ఫీట్ బ్రేక్ చేసింది. ఒక్క 2025 లోనే.. ఏడు సినిమాలను రిలీజ్ చేసే రికార్డులు క్రియేట్ చేసింది. కొన్నేళ్లుగా ఇలాంటి రికార్డును మరే ముద్దుగుమ్మ కనీసం టచ్ కూడా చేయలేకపోయింది. మళయాళ, తెలుగు, తమిళ్లో వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించింది. అలా.. తమిళ్లో డ్రాగన్, బైసన్, డిఫెక్ట్ డిటెక్టివ్ సినిమాలు ఆడియన్స్ను పలకరించాయి. తెలుగులో కిష్కిందపురి, పరదా ఎమోషనల్ టచ్ ఇచ్చాయి. మలయాళం లో జానకి వెడ్స్, స్టేట్ ఆఫ్ కేరళ కి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తన ఏడో మూవీ లాక్ డౌన్.. డిసెంబర్ 5న రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ సినిమా కోవిడ్ 19 లాక్ డౌన్ బ్యాక్ డ్రాప్లో రానుంది.


