టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందిస్తున్న మూవీ వారణాసి. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ సినిమా.. అప్డేట్‌ను రివిల్ చేసేందుకు గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ నిర్వహించాడు జక్కన. ఇక ఈ ఈవెంట్ తర్వాత ఆయనకు షాక్ పై షాక్ తగులుతూ వస్తుంది. వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడుతూ.. హనుమాన్ పై చేసిన కామెంట్స్ పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై పోలీస్ కేసు నమోదయింది. అయితే.. ఇప్పుడు మరోసారి రాజమౌళి వారణాసి సరికొత్త వివాదంలో చిక్కుకుంది.
వారణాసి టైటిల్ మాదే అంటూ డైరెక్టర్ రాజమౌళి పై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు నమోదయింది. ఈ మేరకు రామ బ్రహ్మ హనుమాన్ క్రియేషన్స్ సంస్థ నుంచి కేస్ ఫైల్ చేశారు. మేము రిజిస్టర్ చేసుకున్న టైటిల్ మా పర్మిషన్ లేకుండా వేరే సినిమాకు వాడుతున్నారంటూ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో.. ప్రస్తుతం వారణాసి టైటిల్ వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా రామ బ్రహ్మ హనుమ క్రియేషన్స్ వాళ్ళు కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందనుందని.. పోస్టర్‌లో క్లారిటీ ఇచ్చారు.
ఆది సాయికుమార్‌తో రఫ్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ సి.హెచ్ సుబ్బారెడ్డి.. ఈ సినిమాకు దర్శకుడుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమ టైటిల్ గురించి నిర్మాతలు.. రియాక్ట్ అవుతూ.. వారణాసి టైటిల్ మాదే. రామ బ్రహ్మ హనుమాన్ క్రియేషన్స్ పై మేము రిజిస్టర్ కూడా చేయించాం. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఫిల్మ్ చాంబర్ నుంచి కూడా లెటర్ రిలీజ్ చేశారు. కనుక.. మేము రిజిస్టర్ చేసుకున్న టైటిల్ మా పర్మిషన్ లేకుండా వాడుతున్నారు అంటూ నిర్మాత ఛాంబర్ లో ఆరోపణలు చేశారు. దీంతో.. వారణాసి సినిమా సరికొత్త వివాదంలో చిక్కుకుంది. మరి ఈ రెండు వివాదాలపై రాజమౌళి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.



