నా లైఫ్ లో ఓడిపోయా.. ఎంతోమంది మోసం చేశారో.. శర్వానంద ఎమోషనల్..!

టాలీవుడ్ క్రేజీ హీరో శర్వానంద్.. పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్ లో ఫుల్ బిజీగా మారిపోయిన సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. వరుసగా ఫ్లాప్‌లు ఎదుర్కొంటున్న క్రమంలో.. ఇప్పటికి హిట్, ఫ్లాప్ అని ఆలోచన మానేసి.. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులో బిజీగా గ‌డుపుతున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బైకర్‌. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో మెర‌వ‌నున్నాడు. మాళవిక నాయర్ హీరోయిన్గా.. అభిలాష్ రెడ్డి డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా డిసెంబర్ 6న ఆడియన్స్‌ను పలకరించనుంది.

Sharwanand : నన్ను జీవితంలో చాలా మంది మోసం చేశారు - BigTvLive

ఈ క్ర‌మంలోనే ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్‌తో పాటు.. ఫస్ట్ సింగిల్‌.. ఓ టీన్ బేబీ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక.. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న క్రమంలో.. ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు మేక‌ర్స్‌. ఇందులో భాగంగానే.. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న శ‌ర్వానంద్.. లైఫ్ విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈరోజు మీ దగ్గరికి హీరోలా కాదు.. అన్నలా వచ్చా. నా లైఫ్ లో ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అంటూ కామెంట్స్ చేశాడు.

Sharwanand Inspires Youth During 'Biker' Promotions - ManaTelugu

లైఫ్ లో చాలాసార్లు పడ్డా.. ఎన్నోసార్లు ఓడిపోయా.. మోసపోయా.. కానీ పడిన ప్రతిసారి నేర్చుకున్నా. లైఫ్ ఏదో ఒకటి నేర్పిస్తుంది. మన కథ మనమే రాసుకోవాలి.. బుక్ నీది.. పెన్ను నీది.. స్టోరీ కూడా నీదే.. మీ ఇష్టం వచ్చినట్లు మీ జీవితాన్ని రాసుకోండి అంటూ శ‌ర్వానంద్‌ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఇవి విన్న వారంతా శ‌ర్వ జీవితంలో అంతగా పడిన కష్టాలు ఏమై ఉంటాయి.. అంతలా ఆయనను ఎవరు మోసం చేస్తారు.. అని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.