షాకింగ్: పెళ్లయిన ఏడాదికే మూడో భర్తకు కూడా గుడ్ బై చెప్పేసిన టాలీవుడ్ బ్యూటీ.. పోస్ట్ వైరల్..!

మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. త‌ర్వాత ఇండస్ట్రీలో నటిగా మారింది మీరా వాసుదేవన్. గోల్‌మాల్ సినిమాలో కీలక పాత్రతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మ‌డు.. తర్వాత అంజలి ఐ లవ్ యు సినిమాతో టాలీవుడ్ హీరోయిన్గా ఆడియన్స్ కు పరిచయమైంది. అయితే.. ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోకపోవడంతో.. సరైన ఫెమ్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే.. తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అక్కడ వరుస సినిమాల్లో నటించి భారీ పాపులారిటీ పొంతం చేపుకుంది. ఇక.. 2005 కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న టైంలో వివాహం చేసుకుంది.

Anjali I Love You (2004) - Trailer, Cast & Reviews - Mabumbe

దాదాపు ఐదేళ్ల వైవాహిక జీవితం తర్వాత.. భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. ఇక.. కొంతకాలం సొలో లైఫ్ లీడ్‌ చేసిన మీరా.. 2012లో మళ్ళీ మలయాళ నటుడు జాన్ కొక్కెన్‌ను పెళ్లి చేసుకుంది. వీళ్ళకి కొడుకు కూడా ఉన్నాడు. కానీ.. ఈ బంధం కూడా ఎంతో కాలం నిలవలేదు. పెళ్లయిన నాలుగేళ్లకే ఈ జంట కూడా విడిపోయారు. 2016లో జాన్‌తో విడాకులు తీసుకున్న మీరా.. తర్వాత పలు సీరియల్స్ లో మెరిసింది. ఇక ఈ సీరియల్స్ టైం లోనే.. కెమెరామెన్ విప్పిన్‌తో లవ్ లో పడింది.

Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1  Year - Oneindia News

దీంతె 2024 లో కోయంబత్తూర్ లో మీరా అతనిని వివాహం చేసుకుంది. ఇక.. ఈ మూడో పెళ్లి కూడా మూడునాళ‌ ముచ్చటగానే మిగిలింది. తాజాగా.. ఈ విషయాన్ని తన ఇన్స్టా వేదికగా అఫీషియల్ గా ప్రకటించింది. మీరా వాసుదేవన్.. నేను 2025 ఆగష్ట్‌లో నా భర్తతో విడాకులు తీసుకున్నా.. అప్పటినుంచి సింగల్ లైఫ్ లీడ్ చేస్తున్నా.. ప్రస్తుతం చాలా అందమైన, ప్రశాంతమైన లైఫ్ ఎంజాయ్ చేస్తున్న అనే క్యాప్ష‌న్ జోడించి.. తన ప్రెసెంట్ ఎలా ఉందో ఓ ఫోటోను షేర్ చేసుకుంది. ప్రస్తుతం మీరా చేసిన ఈ షాకింగ్ పోస్ట్ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే ఆమె పోస్ట్ పై రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్.