ఐ బొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి గురించి రోజు రోజుకు సెన్సేషనల్ విషయాలు బయటకు వస్తున్నాయి. కూకట్‌పల్లిలోని రవి అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించిన పోలీసుల.. రూ.3కోట్ల నగదు.. కొన్ని వందల కొద్ది హార్డ్ డిస్క్‌లు, లాప్టాప్స్, మొబైల్స్ స్వాదీనం చేసుకున్నారట. వైజాగ్ కి చెందిన రవి.. టెక్నికల్ ఎక్స్పోర్ట్ అని తేలింది. ప్రపంచంలో ఎలాంటి సర్వర్‌ను అయినా.. ఎంత సెక్యూర్‌గా ఉంచిన దానైనా.. ఈజీగా హ్యాక్ చేయగల టాలెంట్ రవి సొంతం. ఈ క్రమంలోనే కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ప్లేయర్‌ను సైతం అతను హాక్ చేస్తున్నాడు.

కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసి కరేబియన్ దీవులు అడ్డాగా చేసుకుని వరుసగా ఐ బొమ్మ వెబ్సైట్లో సినిమాలను అప్లోడ్ చేస్తూ వస్తున్నాడు. ఐ బొమ్మ పేరుతో 70కి పైగా మిర్రర్ సైట్లను నిర్వహిస్తూ సినిమాలను వదులుతున్నాడు. ఐ బొమ్మ, ఐరాధ, బెప్పమ్.. ఇలా ఎన్నో పేర్లతో ప్రధాన వెబ్సైట్లు రన్ అవుతున్నాయి. ఇక రవికి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉందట. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు రిలీజ్ సిద్ధమవుతున్న క్రమంలో.. నిర్మాతలు వాటిని డిజిటల్ మీడియా సంస్థలకు అందిస్తున్నాయి. రిలీజ్ కోసం ఆ ఓటీటీ సంస్థలు.. థియేటర్లకు శాటిలైట్ ద్వారా కంటెంట్ చేరవేస్తున్నాయి. ఈ క్రమంలోనే.. రవి ఆ కంటెంట్‌ను హ్యాక్ చేసి వెబ్సైట్లో రిలీజ్ చేస్తున్నాడు.

వైజాగ్ లోని ఎంవీపీ కాలనీ సెక్టార్ సెవెన్ లో నివాసం ఉంటూ కూడా.. ఈ కార్యకలాపాలు జరిపాడు. తనును ఎవరు గుర్తించకుండా తగిన జాగ్రత్తలను తీసుకున్నాడట. సెప్టెంబర్ 29న పైరసీ ముఠాకు చెందిన ఇతని అనుచరులు శివాజీ, ప్రశాంత్ అరెస్టు కావడంతో.. అప్పటివరకు హైదరాబాద్‌లో ఉన్న రవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అక్టోబర్ 3న నెథర్లాండ్.. అక్కడ నుంచి ఫ్రాన్స్, కరేబియా దీవులకు ఐపి అడ్రస్‌లు మార్చుకుంటూ షిప్ట్ అవుతూ.. తన కార్యకలాపాలను కొనసాగించాడు. ఈ క్రమంలోనే.. భార్యతో విడాకుల కోసం నెదర్లాండ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ విషయాన్ని భార్య పోలీసులకు తెలియజేసింది.

