టాలీవుడ్ ఇండస్ట్రీలో ఘట్టమనేని హీరోల క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి టాలీవుడ్‌ను షేక్ చేశారు. ఇక తర్వాత కృష్ణ నట వారసుడుగా సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు కేవలం టాలీవుడ్ కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే.. తాజాగా సూపర్ స్టార్ ఫ్యామిలీకి సంబంధించిన మరో అప్డేట్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్‌ను నింపింది. అదే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరొ కుర్ర హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడట. అతను మరెవరో కాదు కృష్ణ పెద్ద కొడుకు.. రమేష్ బాబు తనయుడు. జయకృష్ణ.. టాలీవుడ్ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది. అజయ్ భూపతి డైరెక్షన్లో జయకృష్ణ టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. అశ్విని దత్త్ సమర్పణలో.. చందమామ కథలు బ్యానర్ పై పీ. కిరణ్ ప్రొడ్యూసర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.

ఇక ఈ అనౌన్స్మెంట్‌లో భాగంగా మేకర్స్ రిలీస్ చేసిన పోస్టర్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. తిరుమల కొండని చూపిస్తూ ఆలయం పరిశర ప్రాంతాల కారికేచర్‌తో పోస్టర్లు చాలా ఎక్సైటింగ్గా డిజైన్ చేశారు మేకర్స్. సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో మొదలుకానుందట. టైటిల్ తో పాటు.. మిగతా వివరాలను త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. రాజకుమారుడుతో మహేష్ బాబును ఇండస్ట్రీకి పరిచయం చేసిన అశ్విని దత్త్.. ఇప్పుడు రమేష్ తనయుడు జయ కృష్ణని సైతం టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది.

