SSMB 29: క్రేజీ వీడియో వైరల్.. జక్కన్నని మించిపోయిన మహేష్ ఫ్యాన్స్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శకథీరుడు రాజమౌళి కాంబోలో రూపొందుతున్న ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చేస్తున్న సంగతి తెలిసిందే. మరో 5 రోజుల్లో ఆ ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడనుంది. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ను ఓపెన్ గా ఉంచుతూ వచ్చిన జక్కన్న.. కేవలం ఫస్ట్ లుక్‌తో సరిపెట్టకుండా.. మూడు నిమిషాల గ్లింన్స్‌ వీడియోతో పాటు.. టైటిల్ అనౌన్స్మెంట్ను కూడా చేస్తూ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇవ్వనున్నాడట. ఈ వీడియోతో తాను మహేష్ తో ఎలాంటి సినిమా చేయబోతున్నాడో రాజమౌళి క్లారిటీ ఇచ్చేస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇక.. ఈ సినిమాలో విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ క‌నిపించ‌నున‌న్నాడు.

తాజాగా పృథ్వీరాజ్ సుకుమారుడు ఫస్ట్ లుక్ పోస్టర్లు జక్కన్న రివీల్ చేశాడు. ఈ పోస్టర్ పై ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. యానిమేటెడ్ సిరీస్ నుంచి కాపీ కొట్టడంటూ టాక్‌ కూడా వైరల్ గా మారింది. జక్కన్న సినిమా అంటే మొదటి నుంచి పొగడ్తలతో పాటు.. విమర్శలు కూడా కామన్. ఈ క్రమంలోనే.. దానిని అభిమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే.. ఆర్‌ఆర్ఆర్, బాహుబలి సినిమాలకు కూడా మొదట్లో ఎన్నో విమర్శలు వచ్చినా.. రిలీజైన‌ తర్వాత ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేసిందో అంతా చూసాం. అయితే.. ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 రిజల్ట్ కూడా ఇలాగే ఉండబోతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ఇక.. ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు.. మరో మెయిన్ విలన్ క్యారెక్టర్ లో ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను ఈ నెల 11న రిలీజ్ చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించాడు. దీనికి.. ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి. ఈ క్రమంలోనే.. మహేష్ అభిమానులు గ్యాప్‌లో తమ క్రియేటివిటీని ఉపయోగిస్తున్నారు. జక్కన్న రిలీజ్ చేయబోయే టీజర్ కంటే ముందే తమ బుర్రకు పని పెడుతూ.. క్రియేటివిటీతో సోషల్ మీడియాలో ఎడిటింగ్ వీడియోలను షేర్ చేస్తున్నారు. అలా ఓ అభిమాని చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. అది చూసిన మహేష్ అభిమానుల సైతం జక్కన్నను మించి పోయే రేంజ్ లో ఎడిటింగ్ ఉంది బ్రో అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.