ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనాకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మడు.. తర్వాత హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించిన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒకానొక దశలో ఒకేరోజు మూడు, నాలుగు సినిమాల షూట్లకు హాజరైన సందర్భాలు ఉన్నాయి. అలాంటి మీనా బాలీవుడ్లో మాత్రం.. కేవలం పర్దా హై పర్ద అనే సినిమాలో మాత్రమే నటించింది. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా.. వాటిని రిజెక్ట్ చేస్తూ వచ్చింది.

అయితే.. అలాంటి టైం లోనే ఓ స్టార్ హీరో చేసిన పనికి అటువైపు వెళ్ళాలన్నా భయపడిపోయా అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ హీరో ఎవరు.. అసలు మీనా భయపడి పోయేంతగా ఏం జరిగింది ఒకసారి తెలుసుకుందాం. తాజాగా మీనా.. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. బాలీవుడ్ సినిమాలు చేయలేకపోవడానికి కారణం ఏంటో వివరించింది. తెలుగుతోపాటు.. తమిళ, కనడ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండడం.. అదే టైంలో నాకు బాలీవుడ్ ఆఫర్స్ కూడా రావడంతో అక్కడిదాకా వెళ్లి సినిమాలు చేయలేకపోయా.. ఇక్కడే నాకు తినడానికి, నిద్ర పోవడానికి కూడా సమయం లేనంత బిజీ స్కెడ్యూన్ ఉంది. ఇక బాలీవుడ్ సినిమాలు ఎలా చేయగలను.. పైగా అక్కడ టైం టు టైం షూట్ కంప్లీట్ కాదు. అందుకే ఆఫర్లను రిజెక్ట్ చేసి అంటూ వివరించింది.

అయితే.. అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తికి ఊటీలో ఒక హోటల్ ఉండేదని.. నేను ఏ సినిమా షూటింగ్స్ అని అక్కడకు వెళ్లిన.. ఆ హోటల్ లోనే ఉండేదాన్ని. అప్పుడు చక్రవర్తి ప్రతిసారీ నా దగ్గరకు వచ్చి.. నాతో సినిమా ఎప్పుడు చేస్తారని అడిగేవారు. నాకు చేయాలని ఉన్న కాల్ షీట్స్ ఉండేవి కాదు. అస్సలు ఖాళీ లేని పరిస్థితి. ప్రతిసారి నా దగ్గరకు వచ్చి ఆయన అలా అడగడం నాకే ఇబ్బందిగా అనిపించింది. ఒక దశలో.. అసలు మిథున్ చక్రవర్తి గారి హోటల్‌కు వెళ్లాలంటేనే భయపడేదాన్ని. దానికి కారణం.. నాకు సినిమా చేయడం ఇష్టం లేక కాదు.. అంత పెద్ద స్టార్ హీరోకి.. నా డేట్స్ ఖాళీ లేవని కారణంతో ప్రతిసారి నో చెప్పలేక బాధపడేదాన్ని.. ఊటీకి వెళ్లిన అసలు ఆ హోటల్ కే వద్దు.. వేరే హోటల్ లో రూమ్ బుక్ చేయమని అడిగేదాన్ని అంటూ మీనా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మీనా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.

