టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. గత రెండేళ్లలో తన నుంచి మూడు సినిమాలను రిలీజ్ చేసి మంచి సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ ఏడాది కన్నప్ప గెస్ట్ రోల్లో మెరిసిన ప్రభాస్.. వచే ఏడాదికి రాజాసాబ్, ఫౌజి సినిమాలతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. అలాగే.. సందీప్ రెడ్డివంగా డైరెక్షన్లో స్పిరిట్ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీళ్ళతో పాటే.. ప్రభాస్ డేట్స్ కోసం నాగ అస్విన్, ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఎదురుచూస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ప్రభాస్ బ్రహ్మ రాక్షశా మూవీ చేయబోతున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది.
ఇలా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో.. బిజీగా గడుపుతున్న ప్రభాస్ లిస్టులోకి మరో క్రేజి స్టార్ డైరెక్టర్ కూడా వచ్చి చేరాడట. ఆయన మరెవరో కాదు.. పుష్ప 3తో బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాసి.. సాలిడ్ సక్సెస్ ఖాతాలో వేసుకున్న సుక్కు. ఇక సుకుమార్ తన నెక్స్ట్ సినిమాలో రామ్ చరణ్‌తో చేయబోతున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సన్న డైరెక్షన్ ప్రస్తుతం చరణ్ పెద్ది సినిమా షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక సినిమా పనులు కంప్లీట్ అయిన వెంటనే.. చరణ్‌తో సుకుమార్ తన మూవీని కంప్లీట్ చేసి పుష్ప 3 సెట్స్ పైకి వెళతాడని అంతా భావించారు.
అయితే.. ఇప్పుడు ప్రభాస్ తో సుకుమారి మూవీ చేయనున్నాడని.. ఇప్పటికే సుక్కు కథను కూడా వినిపించాడని.. అది డార్లింగ్ చేయడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సబాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. స్పిరిట్ కంప్లీట్ అయినా వెంటనే సుక్కు సినిమా కోసం ప్రభాస్ రంగంలోకి దిగుతాడంటూ టాక్ నడుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్.. అట్లీ డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అది ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో తెలియదు. ఈ క్రమంలోనే.. సుకుమార్ పుష్ప 3 సినిమాను పక్కనపెట్టి.. ప్రభాస్‌తో ప్రాజెక్ట్‌ను కంప్లీట్ చేయాలని ఆలోచనలో ఉన్నాడట.



