మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన్ డైరెక్షన్లో పెద్ది మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వికనూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా మెరవనంది. ఇక.. సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా.. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్, చరణ్ లుక్స్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే సినిమాపై.. ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక.. తాజాగా మూవీ యూనిట్ అంచనాలను మరింత పెంచుతూ ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్డేట్ను రిలీజ్ చేశారు. పాట పేరు చిక్కరి. ఇక ఈ పదం మీనింగ్ ఏంటి అనే ప్రశ్న సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

అయితే.. తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబు సన్నా.. స్వయంగా ఈ పదానికి మీనింగ్‌ను వివరించాడు. బుచ్చిబాబు కామెంట్స్ ప్రకారం.. చరణ్ మొదటి సారి హీరోయిన్ జాన్విని చూసే సీన్స్‌లో వచ్చే సాంగే ఈ చికిరి. కాగా.. వాళ్ల ఊరిలో అమ్మాయిలను ముద్దుగా ప్రేమగా చికిరి అని పిలుచుకుంటారట. మేకప్ లేకుండా అందంగా ఉన్న అమ్మాయిలను చికిరి అంటారని బుచ్చిబాబు సనా క్లారిటీ ఇచ్చాడు. ఈ అర్థం విన్న రెహమాన్ ఆ పదం పైనే ఒక్క అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేశాడట. దీంతో సింగర్ మోహిత్ చౌహన్ పాటను ఆలపించారు. ఇక.. ఈ సాంగ్ కు సంబంధించిన స్పెషల్ వీడియోను కూడా ఏఆర్ రెహమాన్‌తో కలిసి బుచ్చిబాబు షూట్ చేసాడట.
ఇక ఈ ఫుల్ సాంగ్ నవంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక సినిమా షూటింగ్ దాదాపు 60% కంప్లీట్ అయిపోయిందట. ఇటీవల శ్రీలంకలో సాంగ్ షూట్ ను కంప్లీట్ చేసిన టీం.. హైదరాబాద్‌కు తిరిగి వచ్చేసారు. డిసెంబర్ చివరికల్లా సినిమాను కంప్లీట్ చేసి చరణ్ బర్త్ డేకి మార్చి 27, 2026న రిలీజ్ చేయడానికి అంతా సిద్ధం చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై.. సతీష్ కిల్లారు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి.. తాజాగా చికిరి ప్రోమ రిలీజై ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోమో మీరు ఒకసారి చూసేయండి.


