రూట్ మార్చిన రవితేజ.. మాస్ వల్ల కావట్లేదు.. ఫ్యామిలీ అస్త్రతో రంగంలోకి..!

టాలీవుడ్ మాస్ మహారాజ్‌ రవితేజ రీసెంట్ గా.. మాస్ జాత‌రా సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఇక సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా మెరవ‌డం.. ధమాకా కాంబో రిపీట్ కావడంతో.. సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన క్రేజ్ ద‌క్కించుకుంది. కచ్చితంగా సినిమా మంచి ఇంపాక్ట్ చూపిస్తుందని అభిమానులంతా భావించారు. కానీ.. ఆ రేంజ్‌లో మూవీ అస్సలు లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. రవితేజ మొదటి నుంచి సినిమాలు తీయడం మాత్రమే తన పని అని.. రిజల్ట్ ఆడియన్స్ చేతిలోనే ఉంటుందని నమ్మే వ్యక్తి. అలాంటి మాస్ మహారాజ్.. మాస్ జాతర రిలీజ్ అయినా వెంటనే.. నెక్స్ట్ ప్రాజెక్ట్ కు కూడా షిఫ్ట్ అయిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

అయితే.. నిన్న మొన్నటి వరకు మాస్ వర్షన్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన మాస్ మహారాజ్.. ఇప్పుడు రూటు మార్చాడట. ఈసారి.. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నట్లు సమాచారం. నేను శైలజ నుంచి ఆడాళ్లు మీకు జోహార్లు వరకు ఫుల్ ఆఫ్ కాంప్లిట్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తీస్తూ ఆడియన్స్ మెప్పించిన డైరెక్టర్ కిషోర్ తిరుమలతో.. రవితేజ నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు భక్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవితేజకు.. కేవలం మాస్ ఆడియన్స్ కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ లోను అభిమానులు ఉన్నారు. వాళ్ల కోసమే ఈసారి భక్త మహాశయులకు విజ్ఞప్తి లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను చూజ్‌ చేసుకున్నాడట రవితేజ.

రవితేజ కేవలం మాస్ సినిమాలతోనే కాదు.. తన కామెడీ టైమింగ్‌తోను ఆడియన్స్‌ను ఆకట్టుకోగలడు. ఎమోషనల్ సీన్స్ కూడా అదరగొడతాడు. ఈ క్రమంలోనే.. రవితేజతో ఎమోషన్ విత్, ఎంటర్టైన్మెంట్ జోడించి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్‌కు రీచ్ అయ్యేలా.. రవితేజ ఇమేజ్‌కి ఏమాత్రం తగ్గకుండా, అటు మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటేనే.. ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పించేలా.. ఈ సినిమా రూపొందిన ఉందని సమాచారం. ఇక.. ఈ సినిమాకు బీమ్స్ సిసి రోలియో మ్యూజిక్ అందిస్తుండగా.. నా సామి రంగ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఫిమేల్ లీడ్ గా మెరవనుంది.

Ravi Teja to Team Up with Director Kishore Tirumala for His Next | Andhrawatch.com

ఇక.. రవితేజ నుంచి భద్రా లాంటి ఓ ఫ్యామిలీ ఎమోషన్, మాస్ ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలం అయిపోయింది. మధ్యలో.. చాలా కాన్సెప్ట్‌లు ప్రయత్నించినా.. అవేవీ వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలోనే.. ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అస్త్రతో రవితేజ రంగంలోకి దిగనున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం ఇదే తరహా సినిమాలు మరికొన్ని లైన్లో పెట్టే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. ఇక.. రవితేజ మాస్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. ఇటీవల కాలంలో ఆయన మాస్ సినిమాలు ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అస్త్రా అభిమానులను మెప్పిస్తుందో.. లేదో.. వేచి చూడాలి.