టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్ సంక్రాంతి కానుక జనవరి 9న రిలీజ్ కానుంది. అయితే.. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు సంక్రాంతి బరిలో రిలీజ్ కు సిద్ధమైంది. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా పండగ సీజన్‌లో రిలీజ్ అవుతున్న క్రమంలో.. టాక్‌తో సంబంధం లేకుండా.. కలెక్షన్లు ఇరగదీస్తుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ.. తాజాగా ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న ఓ వార్త.. ఫ్యాన్స్ అందరికీ నిరాశ కల్పిస్తుంది. అదేమిటంటే.. రాజాసాబ్ సంక్రాంతి బరిలో వచ్చే ఛాన్స్‌లు లేవట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిగా కాకపోవడమే దానికి కారణం అంటూ సమాచారం.
గ్రాఫికల్ వర్క్ అప్పటిలోపు పూర్తవడం కష్టమేనని.. పైగా ఓటీటీ డీల్ కూడా ఇంకా ఫిక్స్ కాలేదని అంటున్నారు. ఈ క్రమంలోనే.. వచ్చే వారంలోపు ఈ మూవీ సంక్రాంతి బడిలో రిలీజ్ అవుతుందా.. లేదా.. అనే విషయం తెలియనుంది. ఒక సినిమా ఎంత బడా ప్రాజెక్ట్ అయినా.. ఎలాంటి స్టార్ హీరో నటించినా.. పదే పదే వాయిదా పడుతూ వస్తే.. ఫ్యాన్స్ లో సినిమా పై ఆసక్తి తగ్గిపోతుంది అనడంలో సందేహం లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ నుంచి వచ్చిన హరిహర వీరమల్లు. పవన్ డిప్యూటీ సీఎం గా మంచి సక్సెస్ అందుకొని తిరుగులేని క్రేజ్ ను ఎంజాయ్ చేస్తున్న టైం లో వీరమల్లు సినిమా రిలీజ్ అయినా.. ఓపెనింగ్స్ నుంచి స్ట్రాంగ్ దెబ్బ పడింది.

ఇప్పుడు రాజాసాబ్ విషయంలో కూడా అదే జరగనుందా అంటే ట్రేడ్ వర్గాల నుంచి అవుననే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక టీజర్, థియేట్రికల్ ట్రైలర్ రిలీజై.. ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక సాంగ్స్ రిలీజ్ అవ్వడం మాత్రమే మిగిలి ఉంది. గత నెలలోనే ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అవుతుందని అంతా భావించారు కానీ.. ఇప్పటివరకు సినిమా నుంచి మరో అప్డేట్ రాలేదు. ఈ క్రమంలోనే సంక్రాంతికి కాకుండా సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన హిట్ అవ్వాలంటే మాత్రం.. కచ్చితంగా సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రాబట్టాల్సిందే. ఒకవేళ అరేంజ్ లో టాక్ రాకపోతే మాత్రం మరో వీరమల్లుగా మిగిలిపోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాలంటే మరో వారం చూడాల్సిందే.

