టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు సందీప్ రెడ్డివంగా. తెరకెక్కించింది రెండు మూడు సినిమాలు అయినా.. పాన్ ఇండియా స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపే రేంజ్ లో తన సత్తా చాటుకున్నాడు. ఇక ప్రస్తుతం సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా రూపొందిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల ప్రభాస్ బర్త్‌డే సెలబ్రేషన్స్ లో భాగంగా సినిమా నుంచి ఆడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాడు. ఈ నెలాఖరు నుంచి సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది. దాదాపు 6 నెలల్లో సినిమా షూట్ మొత్తం కంప్లీట్ చేసేలా సందీప్ వంగా ప్లాన్ చేసుకుంటున్నాడట.
ఇదిలా ఉంటే.. స్పిరిట్ తర్వాత సందీప్ మరో బడా ప్రాజెక్ట్‌కు స్టిక్ అయ్యాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. అది కూడా.. అస్సలు ఊహించని ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడట. ఈ హీరో ఎవరో కాదు మహేష్ బాబు. ఎస్.. సందీప్ రెడ్డి తర్వాత మహేష్ బాబుతో ఒక క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి తీసుకురానున్నాడు. దానికోసం.. ఇప్పటినుంచే స్క్రిప్ట్ పనులు కూడా మొదలయ్యాయని ఫిలిం వర్గాల్లో టాక్ వైరల్ గా మారుతుంది. ఇక.. మహేష్ బాబు మరోపక్క రాజమౌళి సినిమా షూట్లో బిజీబిజీగా గడుపుతున్నాడు.
ఈ సినిమా పూర్తి అయ్యేసరికి.. ఎలా కాదన్నా ఏడాదిన్నర పైగా టైం పట్టేస్తుంది. అలాగే.. స్పిరిట్ సినిమా కంప్లీట్ చేయడానికి సినిమాను రిలీజ్ చేయడానికి కూడా కాస్త సమయం పడుతుంది. దీంతో.. స్పిరిట్ పనులు పూర్తయిన వెంటనే మహేష్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయాలని సందీప్ ప్లాన్ చేస్తున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. మహేష్, సందీప్ సినిమా 2027 చివరిలో సెట్స్ పైకి వచ్చేస్తుందని టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వైరల్ అవుతుంది.



