” బాహుబలి ది ఎపిక్ ” రివ్యూ.. రెస్పాన్స్ ఎలా ఉందంటే..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా.. రానా ప్రతినాయకుడిగా కనిపించిన బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ మూవీ బాహుబలి. తెలుగు సినిమా ఖ్యాతిని ఏ రేంజ్‌లో పెంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సినిమా ఫస్ట్ భాగం బాహుబలి ది బిగినింగ్‌.. 2017 లో రిలీజ్ కాగా.. సెకండ్ పార్ట్ బాహుబలి ది కంక్లూజ‌న్.. 2017లో ఆడియన్స్ ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ని బ్లాస్ట్‌ చేసింది. దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత.. ఇప్పుడు రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాగా బాహుబలి ది ఎపిక్ (అక్టోబర్ 31)న‌ మరోసారి గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేశారు మేకర్స్. ఇక.. ఈ సినిమా ఓవర్సీస్‌తో పాటు.. ఇక్కడ కూడా పలుచోట్ల ప్రీమియర్స్‌ను ముగించుకుంది. తెలుగు సినిమా గ్లోబల్ బ్రాండ్‌గా మార్చిన సినిమా.. ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుందో రివ్యూ లో చూద్దాం.

స్టోరీ:
ఇప్పటికే బాహుబలి ని థియేటర్లలో. టీవీలలో. ఓటీటీలలో దాదాపు ఆడియన్స్ అంతా చూసేసే ఉంటారు. సో.. కథకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మాహిష్మతి సామ్రాజ్యా రాజమాత శివగామి ప్రాణత్యాగం చేసి.. మహేంద్ర బాహుబలిని కాపాడుతుంది. ఓ గూడెంలో పెరిగి పెద్దవాడైనా మహేంద్ర బాహుబలి.. అవంతికతో ప్రేమలో పడడం.. ఆమె ఆశయం కోసం మాహిష్మతి రాజ్యానికి వెళ్లి.. అక్కడ వారితో పోరాడి దేవసేనను తీసుకొచ్చి అవంతికకు అప్పజెప్పడం.. ఈ క్రమంలోనే కొన్ని నిజాలు తెలుసుకోవడం.. బందీగా ఉన్న దేవసేన తన తల్లి అని.. బల్లాల కుట్ర చేసి తన తండ్రి అమరేంద్ర బాహుబలిని చంపేశాడని తెలియడంతో.. కట్టప్ప సహాయంతో మహేంద్ర బాహుబలి మహిష్మతి రాజ్యంపై దండయాత్ర చేసి.. బల్లాల దేవుడిని హతం చేయడం.. ఈ కథ మొత్తాన్ని ది ఎపిక్ లో చూపించారు.

రివ్యూ:
బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 చూసిన వాళ్ళందరికీ ఇదంతా తెలిసిన కథ. అయితే.. పార్ట్ 1 చూసినప్పుడు.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే సస్పెన్స్‌తో పార్ట్ 2 కోసం ఆడియన్స్ అంతా ఎదురు చూస్తారు. ఇక.. బాహుబలి ది ఎపిక్‌లో ఏముంటుందిలే కొత్తగా అన్ని అంతా భావించారు. కానీ.. ఈసారి కూడా జక్కన్న తన మ్యాజిక్ ను రిపీట్ చేశాడు. ఎక్కడ బోర్ కొట్టకుండా.. యాక్షన్ స‌నివేశాలు, ఎలివేషన్స్‌తో కథను అద్భుతంగా చూపించాడు. ఆరున్నర గంటల సినిమాను 3గం 45 ని కుదించినా.. అదొక సరికొత్త ఎక్స్పీరియన్స్ లా ఆడియన్స్ లో ఫీల్ కలుగుతుంది. తెరపై చూస్తున్నంత సేపు ఏదో కొత్త సినిమాని చూసిన ఫీల్ ఆడియన్స్ లో వస్తుంది. ఫస్ట్ హ‌ఫ్‌లో పార్ట్ 1 మొత్తాన్ని సెకండ్ హాఫ్‌లో పార్ట్ 2 మొత్తాన్ని చూపించినా.. ఎక్కడా చిన్న క్లారిటీ కూడా మిస్ కాన్నివలేదు.

Baahubali: The Epic (2025) - Movie | Reviews, Cast & Release Date in  Kanpur- BookMyShow

ఈ రెండు భాగాల్లో ఆడియన్స్‌కు బాగా నచ్చిన సీన్స్‌ను మరింత హైలెట్ చేశాడు జక్కన్న. ప్రధాన పాత్రల ఇంట్రడక్షన్ నుంచి.. బల్లాలదేవుడి పట్టాభిషేకం, కాలకేయులతో యుద్ధం, తల నరికే సీన్స్.. ఇవన్నీ తెరపై మరోసారి చూస్తుంటే.. ఆడియన్స్ గూస్‌బంన్స్‌ ఫీలయ్యారు. రెండు భాగాల్లో ఏదో ఒకటి చూసిన వారికి కూడా ఈ సినిమా అర్థమయ్యేలా సీన్‌ల‌ను క్లియర్గా చూపించాడు. అవంతిక.. లవ్ స్టోరీ సీన్‌లను కట్ చేసిన కొత్తగా చూసే వాళ్ళకి అర్థమయ్యేలా జక్కన్న తన వాయిస్ ఓవర్ తో క్లారిటీ ఇచ్చాడు. అయితే.. సుదీప్ కిచ్చాతో పాటు.. కొన్ని కీలకమైన సీన్స్ పాటలను తీసేసాడు. అయినా.. కథలో సోల్ మాత్రం మిస్ కాలేదు. కీరవాణి రికార్డింగ్ కూడా సినిమాకు ఫ్రెష్ నెస్ ను ఇచ్చింది. రన్ టైం కాస్త ఇబ్బందిగా అనిపించినా.. బాహుబలి 1, 2 సినిమాల లానే.. ది ఎపిక్‌లోను విజువల్ వండర్స్ క్రియేట్ చేయడంలో జక్కన్న 100% సక్సెస్ అయ్యాడు.

నటీ నటుల పర్ఫామెన్స్ గురించి కూడా కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ప్రభాస్, రానాతో పాటు.. కీలకపాత్రలో నటించిన వారంతా కెరీర్‌లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ప్రభాస్, అనుష్క జోడిని మరోసారి ఆడియన్స్ తెరపై చూడడానికి తెగ ఎంజాయ్ చేశారు. యాక్షన్ సీన్స్‌లో రానా, ప్రభాస్ పోటీపడి మరి మెప్పించారు. రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నా, సుబ్బరాజ్ ఇలా ప్రతి ఒక్కరు తమ నటనతో ఆక‌ట్టుకున్నారు.

Baahubali: The Epic (2025) - IMDb

టెక్నికల్ గా:
పేరు పెట్టడానికి లేదు. పదేళ్ల క్రితం కీరవాణి తన అద్భుతమైన బిజియంతో ఎలాగైతే మ్యాజిక్ క్రియేట్ చేశాడో.. సీన్లకు ప్రాణం పోశాడో.. అదే ఇప్పుడు కూడా కనిపించింది. ఇక విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అంతకంటే ఎక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలు కూడా.. హీరోయిన్స్‌లో సన్నివేశాలను మేకర్స్ తీర్చి దిద్దలేకపోయారని అభిప్రాయాలు సైతం ఆడియన్స్‌లో వ్యక్తం అవుతున్నాయి. నిర్మాణ విలువలు కళ్ళకు కట్టినట్లు కనిపించాయి. టోటల్గా రీ రిలీజ్ లోను బాహుబలి ది ఎపిక్.. మైల్డ్ స్టోన్‌గా నిలిచిపోతుంది.