రష్మిక ” ది గర్ల్ ఫ్రెండ్ ” ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిందా.. పేరుతో సహా రివీల్ చేసిన డైరెక్టర్..!

టాలీవుడ్‌ నేషనల్ క్రష్‌ రష్మిక మందన, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. చి.లా.సౌ ఫేమ్ డైరెక్టర్, నటుడు రాహుల్ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా నవంబర్ 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్, ట్రైలర్, ఇలా.. ప్రతి ఒక్కటి ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. సినిమాపై భారీ హైప్‌ను నిలకొల్పాయి. ఈ క్రమంలోనే.. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్ బాధ్యతలను డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌తో పాటు.. రష్మిక మందన కూడా షేర్ చేసుకుంటుంది.
The Girlfriend – Trailer [Hindi] | Rashmika Mandanna | Dheekshith Shetty |  Rahul Ravindran | Hesham
అలా.. రష్మిక, రాహుల్ ఇద్దరు వరుస ప్రమోషన్స్‌లో సినిమాని ప్రమోట్ చేస్తూ.. తెగ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ రవీంద్రన్ మాట్లాడుతూ.. ఈ సినిమాల్లో మొదట రష్మిక నటించాల్సింది కాదని.. మరో హీరోయిన్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రాహుల్ రవీంద్రన్ తాజా ఇంటర్వ్యూలో చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. నేను.. ఫస్ట్ నుంచి ఏ స్టోరీ రాసినా.. దాన్ని నా ఫ్రెండ్స్ సమంత, వెన్నెల కిషోర్, సుజిత్ లకు వినిపిస్తాను.. చూడమని చెప్తాను.. అలా ది గర్ల్‌ ఫ్రెండ్ సినిమాని కూడా సమంతకు ఇచ్చి చూడమన్నా అంటూ వివ‌రించాడు.
అతడితో నా అనుబంధానికి పేరు పెట్టలేను.. సమంత సంచలన వ్యాఖ్యలు వైరల్
అయితే.. ఈ కథ మొత్తం చూసిన సమంత.. ఈ సినిమాలో హీరోయిన్ రోల్‌కి నేను అసలు సెట్ అవ్వను.. రష్మికను తీసుకోమని సజెస్ట్ చేసింది.. అలా సమంత ఇచ్చిన సజెష‌న్‌తోనే రష్మికకు స్టోరీ వినిపించాం. ఇక రష్మిక స్టోరీ చదివి రెండు రోజులకు కాల్ బ్యాక్ చేసి.. నాకు స్టోరీ నచ్చింది. వెంటనే సినిమా స్టార్ట్ చేద్దామంది. అలా.. సమంత చేయాల్సిన మూవీ రష్మికకు వచ్చిందంటూ రాహుల్ రవీంద్రన్ వివరించాడు. ప్రస్తుతం.. రాహుల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.