తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేకమైన క్రియేట్ చేసుకున్న లోకేష్ కనకరాజు ప్రస్తుతం హీరోగా ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. దీనిపై గతంలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త రివీల్ అయిరన్పటి నుంచి.. ఇండస్ట్రీ వర్గాలతో పాటు.. ఆడియన్స్‌లోను విపరీతమైన హైప్ మొదలైంది. డైరెక్టర్‌గా.. ఖైదీ, మాస్టర్, విక్రమ్, కూటీ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన లోకేష్.. ఇప్పుడు నటుడిగా మారడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చివరిగా.. కూలి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న లోకేష్.. ప్రస్తుతం సరికొత్త ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నారు. ఇక లోకేష్ హీరోగా నటిస్తున్న కొత్త మూవీ దర్శకుడిగా అరుణ్ మాదేశ్వరన్ వ్యవహరించనున్నాడని టాక్.
విజువల్ ట్రీట్ కు క్యారాఫ్ అడ్రస్ గా మారిన అరుణ్ – లోకేష్ కాంబోలో మూవీ తెరకెక్కనున్న క్రమంలో ఆడియన్స్‌లో మూవీపై మరింత హైప్ మొదలైంది. ఈ సినిమాలో హీరోయిన్గా ఓ కత్తి లాంటి ఫిగర్‌ను సెట్ చేసారట. ఆమె మరి ఎవరో కాదు వామిక గబ్బి. ఇప్పటికే మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతుంది. గ్లామర్, నటన రెండింటిని మిక్స్ చేస్తే ఈ అమ్మడు. తమిళ్లో ఇలాంటి బడా ప్రాజెక్టులో వామిక హీరోయిన్గా కనిపించనుండడంతో.. సౌత్ ఆడియన్స్‌లో ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోతుంది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే.. లోకేష్ హీరో గాను తన పర్ఫామెన్స్ తో అదరగొడతాడంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక హీరోయిన్గా వామిక లుక్, స్టైల్, ప్రెజెన్స్ అందర్నీ ఆకట్టుకోవడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
లోకేష్ తో.. వామికా రొమాన్స్ చేయబోతుందని టాక్ వైరల్ గా మారడంతో వీళ్ళిద్దరి కాంబో వర్కౌట్ అయితే మాత్రం పాన్ ఇండియన్ స్టార్ హీరోల ఇమేజ్ను కూడా మించి పోయే రేంజ్లో లోకేష్ పాపులారిటీ దక్కించుకుంటాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. సినిమాను గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్నారట. గతంలో లోకేష్ దర్శకుడుగాను యాక్షన్ సినిమాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. ఆయన యాక్షన్ ఎలిమెంట్స్.. ఇన్ టెన్స్ క్యారెక్టర్జేషన్లో కొత్త రేంజ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు.. నటుడుగా అదే బ్యాక్‌గ్రౌండ్ సినిమా అంటే మరింత ఫైర్ కనిపిస్తుంది అంటూ.. కచ్చితంగా సినిమా హిట్ అవుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

