టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం రసవతారంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీక్ వీక్ అదిరిపోయే ట్విస్టులతో ఆడియన్స్ లో మరింత హైప్‌ను క్రియేట్ చేస్తుంది. ఇక సీజన్ 3 నుంచి బిగ్ బాస్ కు హోస్ట్‌గా కింగ్ నాగార్జుననే కంటిన్యూ అవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 6 సీజన్ల నుంచి నాగార్జున బిగ్ బాస్ లవర్స్ ను అల్లరిస్తూ వస్తున్నాడు. అయితే నాగార్జున హోస్ట్‌గా చేయడానికి మరో రీజన్ ఆ హౌస్ సెట్స్ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే వేయడం.
సిటీ సెంటర్లో అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ తెలుగు సెట్స్ ఉన్నాయి. సీజన్ 3 నుంచి ఇక్కడే హౌస్ నిర్మిస్తూ వస్తున్నారు. దీంతో నాగార్జున తప్ప హోస్ట్‌గా మరో ఆప్షన్ లేకుండా పోయింది. అయితే.. బిగ్ బాస్ సీజన్ 10 మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో కాకుండా.. బయట ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. బిగ్ బాస్ సీజన్ 9 వరకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఎండిమోల్ సంస్థ అగ్రిమెంట్‌ను కుదుర్చుకుందట. ఇప్పుడు.. అది పూర్తయిపోతున్న క్రమంలో సీజన్ 10 కొత్త వెన్యూలో ప్రారంభించేలా టీం ప్లాన్ చేస్తున్నారట. సో బిగ్ బాస్ సీజన్ 10 లో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉండే అవకాశం లేదు.
కనుక.. నాగార్జునని కూడా హోస్ట్‌గా మార్చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పనున్నాడని.. ఆయన ప్లేస్ లో సరికొత్త సెలబ్రిటీ హోస్ట్‌గా కనిపించనున్నారని సమాచారం. ఇప్పటివరకు ప్రతి సీజన్ విషయంలోనూ ఇలాంటి టాక్ నడిచినా.. ఈసారి మాత్రం బిగ్ బాస్ హౌస్ సేటప్ కూడా మార్చేస్తున్నారు కనుక.. కచ్చితంగా పోస్ట్ మారతాడని టాక్ వైరల్ గా మారుతుంది. మరి.. బిగ్‌బాస్ సీజన్ 10 లో నిజంగానే ఈ మార్పులన్నీ జరుగుతాయో లేదో చూడాలి.



