పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. OG సీక్వెల్ పై క్రేజీ అప్డేట్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. ఆడియ‌న్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దానయ్య ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. పవన్ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా టాక్ పరంగాను మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఫ్యాన్స్ ప‌వ‌న్‌ను ఏ రేంజ్‌లో అయితే చూడాలనుకుంటున్నారో.. అదే విధంగా చూపించి ఎలివేషన్స్ ఇస్తూ ఫుల్ ఫిస్ట్‌ అందించాడు సుజిత్. కేవలం అభిమానులే కాదు.. సాదరణ ఆడియన్స్ సైతం పవన్‌ లుక్, ఎలివేషన్స్‌కు ఫిదా అయిపోయారు.

ఈ క్రమంలోనే.. పవన్ కూడా ఫుల్ హ్యాపీ. సినిమాకు సీక్వెల్ లేదా.. ఫ్రీక్వెల్ చేసే ఆలోచన ఉంటే కచ్చితంగా అందులో నటిస్తానని క్లారిటీ ఇచ్చేసాడు. సుజిత్ సైతం గతంలో ఈ సినిమా యూనివర్సిటీ కొనసాగుతూనే ఉంటుందంటూ కామెంట్స్ చేసాడు. దీంతో పవన్ అభిమానులు ఓజీ సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను సుజిత్ మొదలు పెట్టేసాడట.

ఓజీ సినిమాకు పని చేసిన మొత్తం స్టాప్.. రైటర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్, ఇత‌ర డైరెక్ష‌న్ టీం మొత్తాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నాని హీరోగా.. సుజిత్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఓజీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి.. సుజిత్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేలా టీం ప్లానింగ్ లో బిజీ అయ్యారట. నాని సినిమాకు సరికొత్త టీం వేయించుకున్న‌ సుజిత్.. ఆ టీం తో పనిచేస్తూనే ఓజీ సీక్వెల్ కోసం.. ఆ టీంను కూర్చోబెట్టినట్లు సమాచారం. అయితే ఓజిని నిర్మించిన దానయ్య.. సీక్వెల్‌కు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇక పవన్ ఇప్పటికే పలువురు నిర్మాతలకు తన డేట్స్ ను కేటాయించేసాడు. ఈ క్రమంలోనే ఓజీ 2 నిర్మాత ఎవరున్నది తెలియాల్సి ఉంది.